Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబుల్ డయాబెటిస్.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? అసలు ఒక వ్యక్తికి రెండు రకాల డయాబెటిస్ ఒకేసారి వస్తాయా? ఇప్పటికే షుగర్ ఉన్నవాళ్లు రోజూ ఇన్సులిన్ తీసుకుంటున్నా, రక్తంలో షుగర్ ఎందుకు కంట్రోల్ కావడం కష్టంగా మారుతుంది? దీని వెనుక ఉన్న కారణమేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మన శరీరంలో ఇన్సులిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. మనం తిన్న ఆహారం నుంచి గ్లూకోజ్ తయారవుతుంది. ఈ గ్లూకోజ్ శరీరానికి శక్తిని ఇస్తుంది. అయితే అది రక్తం నుంచి కణాల్లోకి వెళ్లాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం.
టైప్-1 డయాబెటిస్ ఉన్నవారిలో శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఇన్సులిన్ తయారు చేసే కణాలనే దెబ్బతీస్తుంది. దీంతో శరీరంలో ఇన్సులిన్ తగినంతగా తయారవదు. అందుకే వీరు బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, శరీరంలో ఇన్సులిన్ ఉన్నప్పటికీ కణాలు దానికి సరిగ్గా స్పందించకపోవడాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీంతో రక్తంలో షుగర్‌ను నియంత్రించడం కష్టమవుతుంది. టైప్-1 డయాబెటిస్ ఉన్న వ్యక్తికి ఈ సమస్య కూడా ఏర్పడితే, ఆ పరిస్థితిని డబుల్ డయాబెటిస్ అని పిలుస్తారు. మరి దీన్ని ఎలా గుర్తించాలి?
Also Read
రక్తంలో షుగర్ పదేపదే ఎక్కువగా ఉండటం, ఎంత జాగ్రత్తగా ఉన్నా షుగర్ నియంత్రణలోకి రాకపోవడం, విపరీతమైన అలసట, ఎక్కువ దాహం, తరచూ మూత్రవిసర్జన వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన డబుల్ డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారించలేం. వైద్యులను సంప్రదించి అసలు కారణాన్ని తెలుసుకోవాలి. ఇక ఈ సమస్య వచ్చే అవకాశాలను పెంచే అంశాలేంటి? పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లు, కుటుంబంలో టైప్-2 డయాబెటిస్ చరిత్ర ఉండటం వంటివి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌పై ప్రభావం చూపవచ్చు.
అయితే అధిక బరువు ఉన్నవారికే ఈ సమస్య వస్తుందనుకోవద్దు. సన్నగా ఉన్నవారిలోనూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడవచ్చు. అసలు ప్రమాదం ఏంటంటే, రక్తంలో షుగర్ ఎక్కువకాలం నియంత్రణలో లేకపోతే గుండె, కళ్లు, నరాలు, కిడ్నీలపై ప్రభావం పడవచ్చు.
గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం పెరగవచ్చు. కళ్లలోని రెటీనాకు నష్టం కలిగి చూపు తగ్గవచ్చు. పాదాల్లో మంట, తిమ్మిర్లు, స్పర్శ తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కిడ్నీల విషయంలో జాగ్రత్త అవసరం. షుగర్ ఎక్కువకాలం పెరిగి ఉంటే కిడ్నీల్లో రక్తాన్ని వడపోసే చిన్న రక్తనాళాలు దెబ్బతినవచ్చు. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా, మూత్రంలో ప్రోటీన్ బయటకు రావడం, కిడ్నీల పనితీరు తగ్గడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అందుకే క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. మరి ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? పోషకాలు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి. రోజూ నడక లాంటి వ్యాయామాలు చేయాలి. రక్తంలో షుగర్ స్థాయిలతో పాటు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రణలో ఉంచుకోవాలి. స్మోకింగ్కి దూరంగా ఉండాలి. కంటి పరీక్షలు, పాదాల పరీక్షలు, కిడ్నీ పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదు.
ముఖ్యంగా టైప్-1 డయాబెటిస్ ఉన్నవారిలో షుగర్ నియంత్రణ కష్టంగా మారితే సొంతంగా ఇన్సులిన్ మోతాదును మార్చుకోవద్దు. వైద్యులను సంప్రదించి కారణాన్ని గుర్తించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే డయాబెటిస్ ఉన్నవాళ్లు షుగర్ లెక్కలపైనే దృష్టి పెట్టకుండా, గుండె నుంచి కిడ్నీల వరకు మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై శ్రద్ధ పెట్టాలి.
తాజావార్తలు
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
-
WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
-
భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ ఎస్యూవీ.. Renault Duster Hybrid లాంచ్.. ధర, ఫీచర్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?