Shamonda Virus: ‘‘షమోండా వైరస్’’ కలకలం.. తొలి మానవ మరణం నమోదు..
- ఫ్రాన్స్‌లో షమోండా వైరస్ తొలి నమోదిత మానవ ఇన్ఫెక్షన్
- తీవ్రంగా రోగనిరోధక శక్తి తగ్గిన బాధితుడు అక్టోబర్ ప్రారంభంలో మృతి
- పశువుల్లో ప్రధానంగా కనిపించే వైరస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamonda Virus: పశువుల్లోనే కనిపించే షమోండా వైరస్ (Shamonda Virus) ఇప్పుడు మనుషుల్లో కనిపించింది. తొలిసారిగా మానవుల్లో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ను ఫ్రాన్స్‌లో గుర్తించారు. ఈ వైరస్ సోకిన వ్యక్తి మరణించారు. అయితే, బాధితుడి మరణానికి ఈ వైరస్ కారణమైందా? లేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయా.? అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో రోగ నిరోధక శక్తి తగ్గిపోయిన వ్యక్తి అక్టోబర్ ప్రారంభంలో మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. తూర్పు ఫ్రాన్స్‌లోని ఈ వ్యక్తికి ఈగ కాటు వల్ల వైరస్ సోకి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, వైరస్ సోకే విధానం, మరణానికి దారి తీసే దాని పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది.
షమోండా వైరస్ అంటే ఏమిటి.?
షమోండా వైరస్ ‘ఆర్థోబున్యావైరస్(Orthobunyavirus) జాతికి, సింబు సెరోగ్రూప్కు చెందింది. ఇది కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. 1960లో నైజీరియాలో తొలిసారిగా దీనిని గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలతో పాటు జపాన్‌లోనూ ఈ వైరస్ ఉనికి కనిపించింది. ఈ వైరస్ ప్రధానంగా పశుశుల్ని ప్రభావితం చేస్తుంది. ఆవులు, గొర్రెలు, మేకలు, గుర్రాల వంటి జంతువులకు సోకుతుంది. పశువుల్లో జ్వరం, విరేచనాలు, నీరసం, పాల ఉత్పత్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. గర్భధారణ సమయంలో పశువులకు ఇన్ఫెక్షన్ సోకితే పునరుత్పత్తికి సంబంధించిన సమస్యలు, పిండం అభివృద్ధిలో లోపాలు ఏర్పడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
Also Read
జర్మనీ, స్విట్జర్లాండ్‌లో పశువులకు వైరస్
జర్మనీ, స్విట్జర్లాండ్‌లో పశువులకు వైరస్..అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం..2026లో మధ్య యూరప్‌లో షమోండా వైరస్ కొత్త జన్యు సమూహాన్ని గుర్తించారు. జూన్‌లో దక్షిణ జర్మనీ, స్విట్జర్లాండ్‌లో పశువుల్లో ఇది సంక్రమించింది. మాలిక్యులర్ పరీక్షలు, మెటాజెనోమిక్ సీక్వెన్సింగ్ ద్వారా శాస్త్రవేత్తలు వైరస్‌ను గుర్తించి, దాని పూర్తి జన్యు సమాచారాన్ని విశ్లేషించారు. ఈ వైరస్ నైజీరియాలో గతంలో గుర్తించిన షమోండా వైరస్‌కు జన్యుపరంగా దగ్గరగా ఉందని తేలింది.
ప్రజలకు ప్రమాదమా..?
ఫ్రాన్స్‌లో నమోదైన కేసు అసాధారణమైందిగా అధికారులు చెబుతున్నారు. బాధితుడి రోగనిరోధక శక్తి తీవ్రంగా క్షీణించడంతో, ఈ వైరస్ సాధారణ ప్రజలకు ఎంత వరకు ముప్పు కలిగిస్తుందనే దానిపై పరిశోధనలు అవసరమని అంటున్నారు. ప్రస్తుతానికి మనుషుల మధ్య నిరంతర వ్యాప్తికి సంబంధించిన ఆధారాలు లేవని, సాధారణ ప్రజలకు ముప్పు లేదని తెలిపారు. షమోండా వైరస్‌కు ప్రస్తుతం వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న టీకా లేదు. వైరస్ ఎలా వ్యాపిస్తుంది, వివిధ జాతులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, మానవుల్లో నమోదైన కేసు కొత్త ప్రమాదానికి సంకేతమా అనే అంశాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Shamonda Virus: ‘‘షమోండా వైరస్’’ కలకలం.. తొలి మానవ మరణం నమోదు..
-
Telangana SSC Exams : తెలంగాణ టెన్త్ పరీక్షల ఫీజు షెడ్యూల్ ఇదే.. చివరి తేదీ ఎప్పుడంటే.?
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Teja Sajja: డిసెంబర్లో పెళ్లి.. అమ్మాయి ఎవరో క్లారిటీ ఇచ్చేసిన తేజ సజ్జ
-
Dhanush – Aishwaryaa: ధనుష్ – ఐశ్వర్య మళ్లీ కలుస్తున్నారా? అనిరుధ్ పెళ్లి వేదికగా బిగ్ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!
-
200MP+200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ OPPO Find X10 Pro Max లాంచ్..!