Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
- పార్టీ మారే ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి
- శ్రీకాకుళం మేయర్ పదవి కూటమిలో జనసేనకు కేటాయింపు
- గుండ కుటుంబం, ఎమ్మెల్యే గొండు శంకర్ వర్గం మధ్య ఆధిపత్య పోరు
- లక్ష్మీదేవిని వైసీపీలోకి ఆహ్వానించిన ధర్మాన ప్రసాదరావు
- వైసీపీలో చేరి మేయర్‌గా పోటీ చేసే అవకాశాలు
- అధినేతను ఒప్పించిన ధర్మాన ప్రసాదరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: సిక్కోలు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. స్థానిక సంస్థల ఎన్నికలవేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నేతల ఎత్తులు పైఎత్తులతో రాజకీయం రంజుగా మారింది. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలకు కేంద్రంగా మారింది. టికెట్ల కోసం నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. అయితే, రిజర్వేషన్ల అంశం తేలినప్పటికీ ఇంకా కోర్టుల్లో కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దాంతో ఇక్కడ ఇప్పుడప్పుడే ఎన్నికలు జరిగే అవకాశంలేదు. అయితే… ఆశావహులు మాత్రం ప్రయత్నాలు ముమ్మరంగానే సాగిస్తున్నారు. అదే సమయంలో టికెట్ దక్కదని అంచనాకు వచ్చేసిన నేతలు గోడ దూకేందుకు రెడీ అయ్యారట. అందులో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కూడా ఉన్నారట. ఆమె శ్రీకాకుళం మేయర్ పదవి ఆశించారు. ఆమె ఆశలు నెరవేరే అవకాశం లేదని తేలిపోయింది. ఎందుకంటే శ్రీకాకుళం మేయర్ పదవిని కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించారు. దాంతో తనకు అవకాశంలేదని ఫిక్స్ అయిపోయిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారట.
ఈ విషయంలో నిన్నమొన్నటివరకు డైలమాలో ఉన్న ఆమె… ఇప్పుడు క్లారిటీకి వచ్చేసి వైసీపీ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారట. గత సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి గుండ కుటుంబం, ఎమ్మెల్యే గొండు శంకర్ వర్గం మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ విగ్రహాల ఏర్పాటు అంశం కూడా వివాదానికి కారణమైంది. దివంగత అప్పల సూర్యనారాయణ విగ్రహాలు పెట్టనీయకుండా వ్యవహరించడంతో పార్టీతో ఆమె విభేదించారట. అధినేత చంద్రబాబు తమకు టిక్కెట్ ఇస్తారని ఆశించిన లక్ష్మిదేవి అది జరగకపోవడంతో… పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకునేందుకు సిద్ధపడుతున్నారట. ఈ విషయం గ్రహించిన వైసీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మంత్రాంగం నడిపారట. 2014లో ధర్మాన ప్రసాదరావుపై విజయం సాధించిన లక్ష్మిదేవిని ఇప్పుడు అదే ధర్మాన ప్రసాదరావు ఫ్యాన్ పార్టీలోకి ఆహ్వానించారట. తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడంతో గుండ ఫ్యామిలీ వైసీపీ వైపు చూస్తోందనేది తాజా సమాచారం.
Also Read
గుండ కుటుంబానికి దశాబ్దాలుగా టీడీపీతో అనుబంధం ఉంది. అంతగా సేవ చేసిన పార్టీలో తమకు అన్యాయం జరుగుతోందని గుండ లక్ష్మీదేవి ఆవేదనలో ఉన్నారట. తమను అణగదొక్కాలని ఓ వర్గం పనిగట్టుకుని ప్రయత్నిస్తోందని అభిమానులు, అనుచరుల వద్ద లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారట. అమ్మ అమ్మ అంటూ తమ వెంట తిగిరినవారే తమకు సున్నం పెట్టారని అంటున్నారట లక్ష్మిదేవి. వారికి తగిన గుణపాఠం చెప్పాలంటే తప్పకుండా పార్టీని వీడాల్సిందేనంటూ అభిమానులకు చెబుతున్నారట. తెలుగుదేశం పార్టీ తన పట్ల ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో చూశాకే తదుపరి అడుగులు వేయాలని లక్ష్మీదేవి ఇంతకాలం వేచి చూశారట. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది. శ్రీకాకుళం మేయర్ పదవి మహిళలకు రిజర్వ్ అయింది. కానీ దానిని జనసేనకు కేటాయించడంతో కఠిన నిర్ణయం తీసుకోవాలని లక్ష్మి దేవి నిర్ణయించుకున్నారట. జిల్లాలోని కొందరు నేతలు తమకు వెన్నుపోటు పొడిచారని ఆవేదనతో ఉన్న లక్ష్మీదేవి… వైసీపీలో చేరి మేయర్‌గా పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ఆస్తులు అమ్మి రాజకీయం చేస్తారన్న పేరున్న గుండ ప్యామిలీకి వైసీపీ ప్లస్‌గా మారుతుందనే అంచనాలున్నాయి.
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన మార్క్ రాజకీయంతో గుండ ఫ్యామిలీని వైసీపీకి దగ్గర చేసేందుకు తెరవెనుక మంత్రాంగం నడిపించారట. శ్రీకాకుళం పట్టణంలో గుండ ఫ్యామిలీకి మంచి పట్టుందని… అది వైసీపీకి బాగా కలసి వస్తుందని అధినేతను ఒప్పించడంతో పాటు… లక్ష్మీదేవి కోసం బీఫాం కూడా సిద్ధం చేశారట. ఇక గుండ లక్ష్మీదేవి పసుపు కండువా తీసేసి… వైసీపీ కండువా కప్పుకోవడమే తరువాయి అని ధర్మాన అనుచరులు చెప్పుకుంటున్నారట. శ్రీకాకుళం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మారాక… ఇప్పటివరకూ ఎన్నికలు జరగలేదు. కోర్టు కేసులు తేలిన తర్వాతే కార్పొరేషన్‌కు మొదటిసారి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మొదటి మేయర్ పదవిని తామే సొంతం చేసుకోవాలని వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకే గుండ లక్ష్మిదేవిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. మరి ధర్మాన ప్రసాదరావు మంత్రాగం ఫలిస్తుందా..? మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వైసీపీ గూటికి చేరుతారా..? అనేది తేలాల్సి ఉంది.
తాజావార్తలు
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!