Jailer 2 Review : జైలర్ 2 రివ్యూ.. జైలర్ మ్యాజిక్ రిపీట్ అయిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3 / 5
- MAIN CAST: Rajni Kanth, Ramyakrishna, Yogibabu, Suraj Venjaramoodu, S.J Suryah
- DIRECTOR: Nelson Dileep Kumar
- MUSIC: Anirudh
- PRODUCER: Sun Pictures
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘జైలర్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనిరుధ్ సంగీతం అందించిన ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. ఇక చాలా కాలానికి జైలర్ 2 ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించి తెలుగులో కూడా పెద్ద ప్రమోషన్స్ చేయలేదు. జైలర్ మొదటి భాగం మీద ఉన్న బజ్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఈ సినిమాని తెలుగులో నాగవంశీ హక్కులు కొనుగోలు చేసి మరీ రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
జైలర్ 2 కథ:
తన కొడుకు చనిపోయిన తర్వాత ఫ్యామిలీతో కలిసి కోయంబత్తూరులో ఒక సూపర్ మార్కెట్లో మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్). అయితే తన కొడుకు చనిపోవడానికి కారణమైన వర్మ (వినాయకన్) పైన ఉన్న బాస్ ఎవరో తెలుసుకొని అతన్ని చంపేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతనికి దిలీప్ (సురాజ్ వెంజారమూడు) కూడా అదే గ్యాంగ్ కి చెందినవాడని తెలుస్తుంది. అతని ద్వారా వర్మ బాస్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు టైగర్. మరి ఈ ప్రయత్నం ఫలించిందా? అసలు వర్మ పైన ఉన్న బాస్ ఎవరు? ఈ ప్రయత్నంలో టైగర్ స్నేహితులు శివరాజ్ కుమార్, మోహన్ లాల్, హృతిక్ రోషన్ ఎలా సహాయపడ్డారు? ఈ కథలో బోధి (ఎస్.జె. సూర్య), కాంత (విద్యాబాలన్), చక్రి (మిథున్ చక్రవర్తి) పాత్రలు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
Also Read
విశ్లేషణ:
నిజానికి రజనీకాంత్ సినిమా వస్తుందంటేనే తమిళనాడులో కాలేజీలకు సైతం సెలవులు ఇచ్చేంత బజ్ ఉంటుంది. కానీ ఎందుకో కానీ ఈ సినిమాకి అలాంటి బజ్ ఏర్పడలేదు. కానీ మొదటి భాగానికి ఉన్న క్రేజ్ ఈ భాగానికి బాగానే క్యారీ ఫార్వర్డ్ అయింది. తెలుగులో కూడా ఒక ప్రెస్ మీట్ లేకుండానే ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరిచారు. ఇక సినిమా ప్రారంభమైనప్పటి నుంచి సినిమా మొదటి పార్ట్ కి కొనసాగింపు అని ఈజీగానే అర్థమవుతుంది. కథను అక్కడ నుంచే నడిపించాడు దర్శకుడు. కథలోకి వెళుతున్న కొద్దీ కథ మీద ఆసక్తి పెరుగుతుంది. అయితే కథలోకి వెళ్లే వరకు కొంత సాగదీసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.
అయితే ఒక్కసారి కథ ప్రారంభమయ్యాక సరైన కిక్కిచ్చే మూవీ అనే ఫీలింగ్ కలిగేలా అనిరుధ్ తన డ్యూటీ చేశాడు. కథగా చెప్పాలంటే, మళ్లీ తన ఫ్యామిలీని వచ్చే ఆపదల నుంచి కాపాడుకుంటూనే, తన కొడుకు లంచగొండిగా మారడానికి కారణమైన వారిని అంతమొందించే టైగర్ ప్రయాణమే ఈ సినిమా. దానికి అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు యోగిబాబు కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యాయి. సినిమా మొదటి భాగం అంతా టైగర్ ను విలన్ గ్యాంగ్ ట్రేస్ చేయడం, ఆ విలన్ గ్యాంగ్ పక్కనే ఉంటూ టైగర్ ఆడే ఆటలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ ముందు వచ్చే ప్రీ-ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ మీద ఒక్కసారిగా అంచనాలను పెంచేస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ ప్రారంభమయ్యాక కథ రొటీన్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ చూసినట్టుగానే అనిపిస్తుంది అనే ఫీలింగ్ కలిగిస్తూనే, కథలో వచ్చిన కొత్త క్యారెక్టర్లతో కథను నడిపించిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఊహించని కొన్ని స్పెషల్ ఎంట్రీలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చేలా డిజైన్ చేసుకున్నారు. మొత్తంగా టికెట్ కొనుక్కుని థియేటర్లోకి వెళ్లిన ఆడియన్స్ మంచి కిక్ ఫీల్ అయ్యేలా చేసి, థియేటర్ల నుంచి బయటికి పంపించారు అని చెప్పొచ్చు. ఆ రకంగా జైలర్ మ్యాజిక్ రిపీట్ అయినట్టే అని చెప్పొచ్చు.
ఇక నటీనటుల విషయానికి వస్తే, రజనీకాంత్ ఎప్పటిలాగే అదరగొట్టారు. తన వయసుకు తగ్గ పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్నిచోట్ల కళ్ళతోనే హావభావాలను పలికించిన తీరు అభినందనీయం. ఇక ఎస్.జె. సూర్య విలనిజం రొటీన్ అనిపిస్తుంది. యోగిబాబు కామెడీ ఆకట్టుకుంది. మూర్తి పాత్రలో నటించిన నటుడు కూడా ఆకట్టుకునేలా నటించాడు. ఇక మోహన్ లాల్, విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి వాళ్ళు కనిపించింది ఒకటి రెండు సీన్లే అయినా విజిల్స్ వేయించారు. ఇక మిథున్ చక్రవర్తి చాలా కాలం తర్వాత కొంత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించారు. విద్యాబాలన్ నటన ఆకట్టుకునేలా ఉంది. రమ్యకృష్ణ రోల్ రొటీన్ అనిపిస్తుంది. మిగతా పాత్రలందరూ తమ తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు.
ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఎప్పటిలాగే ఈ జైలర్ 2 సినిమాకి కూడా టెక్నికల్ హీరో అనిరుధ్. ఈ సినిమాని విత్ అనిరుధ్ మ్యూజిక్, వితౌట్ అనిరుధ్ మ్యూజిక్ అని డివైడ్ చేసుకుంటే, వితౌట్ అనిరుధ్ మ్యూజిక్ ఊహకే అందదు అన్నట్లుగా రెచ్చిపోయాడు. కొన్ని సాంగ్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. నిజానికి ఫస్ట్ పార్ట్ కి వాడిన చాలా బీజీఎమ్స్ ఇక్కడ కూడా వాడాడు, కానీ ఎందుకో ఫ్రెష్ ఫీల్ అనిపించేలా చూసుకున్నాడు. ఇక కథలో కొత్తదనం లేకపోయినా కథనంతో దాన్ని నడిపించిన తీరు దర్శకుడికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు అయితే అత్యద్భుతం అనే చెప్పొచ్చు. నిడివి ఇంకాస్త తగ్గించే అవకాశం ఉంది. లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఆర్ట్ వర్క్ కూడా చాలా అభినందనీయం అనే చెప్పొచ్చు.
ఇక ఫైనల్లీ, జైలర్ 2 – రజనీ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ అనిరుధ్ మ్యాజిక్!
తాజావార్తలు
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..