Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు తెరపై హీరోలంటే కేవలం స్టైల్, మాస్ ఇమేజ్, లుక్స్ మాత్రమే కాదు. ఒక నటుడు తనను తాను పూర్తిగా మార్చుకుని, ఒకే పాత్రలోని భిన్నమైన కోణాలను తెరపై ఆవిష్కరించగలిగితే.. ఆ పెర్ఫార్మెన్స్కు దక్కే గుర్తింపే వేరు. ఇప్పుడు టాలీవుడ్లో సరిగ్గా అలాంటి అద్భుతమైన ప్రయోగంతోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు యంగ్ టాలెంటెడ్ యాక్టర్ రాగ్ మయూర్. ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో ‘సత్తిబాబు’ పాత్రలో ఆయన చేస్తున్న మేకోవర్, చూపిస్తున్న నటనా వైవిధ్యం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకే సినిమాలో విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రను పోషించడం అంటే కేవలం ఐదు గెటప్పులు వేయడం కాదు. ప్రతి దశకూ తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్, మాటతీరు, భావోద్వేగాలను పలికించాల్సి ఉంటుంది. ఒక యువకుడిగా ఉన్నప్పుడు ఉండే చురుకుదనం.. వయసు పెరిగే కొద్దీ వచ్చే నెమ్మదితనం, నిలబడే తీరు, భుజాల కదలికలను రాగ్ మయూర్ తెరపై అత్యంత సహజంగా ఆవిష్కరిస్తున్న తీరు ఆయనలోని పరిణతి చెందిన నటుడిని బయటపెడుతోంది.
సత్తిబాబు పాత్రకు ఉన్న మరో స్పెషాలిటీ.. అది శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన బుర్రకథ కళాకారుడి పాత్ర కావడం. శ్రీకాకుళం యాసను నేర్చుకుని సహజంగా పలికించడం ఒక ఎత్తైతే.. బుర్రకథ వంటి సంప్రదాయ కళారూపానికి అవసరమైన హావభావాలు, స్వర విన్యాసాలను అలవర్చుకోవడం నటుడిగా రాగ్ మయూర్‌కు ఒక యాసిడ్ టెస్ట్. భారీ దుస్తులతో, శారీరక శ్రమను తట్టుకుంటూ ఈ పాత్రను ఆయన పోషిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. కమర్షియల్ మూసకు పరిమితం కాకుండా ‘గరివిడి లక్ష్మి’ లాంటి విభిన్నమైన, ఛాలెంజింగ్ పాత్రను ఎంచుకోవడం రాగ్ మయూర్ కెరీర్లో ఖచ్చితంగా ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. స్టార్డమ్కు మించి నటుడిగా తనదైన ముద్ర వేయాలని తపిస్తున్న ఈ నటుడు.. టాలీవుడ్లో ‘నెక్స్ట్ బిగ్ థింగ్’గా ఎదగడం పక్కా అని చెప్పొచ్చు!
Also Read
- Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: 'రుద్రవనం'లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
- RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
- RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ ఓపెనింగ్ అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన మైత్రి రవిశంకర్!
- Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
తాజావార్తలు
-
Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
AP SEC: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు NOC, నో డ్యూ సర్టిఫికెట్లు అవసరం లేదు..!
-
Saudi Arabia: అప్పు చేసి సౌదీకి వెళ్లిన బంగ్లాదేశీ మహిళ.. చివరకు మరణశిక్ష!.
-
CM Chandrababu Naidu: వారం రోజులే గడువు.. క్షేత్రస్థాయికి వెళ్లండి, ప్రజల్లో ఉంటే తిరుగుండదు..! నేతలకు సీఎం కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..