CM Chandrababu Naidu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
- నిత్యవసరాల ధరల తగ్గుదలకు చర్యలు తీసుకోండి
- మరింత వేగంగా పీఎం సూర్యఘర్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలి
- ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Naidu: ఎల్ నినో ప్రభావంతో దేశ వ్యాప్తంగా ధరల పెరుగుదల కన్పిస్తోందని, ఆ ప్రభావం నిత్యవసరాలపై పడకుండా చూడాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ సమీక్షలో భాగంగా వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. బియ్యం, కందిపప్పు, ఉల్లి, వంటనూనె, పంచదార వంటి నిత్యవసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతుబజార్లలో ప్రభుత్వం తరఫున అందిస్తున్న బియ్యం అమ్మకాలపై సీఎం ఆరా తీశారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. అలాగే దీపావళీ, సంక్రాంతి వంటి పండుగల సమయంలో కూడా రైతు బజార్లల్లో తక్కువ ధరకు ఫైన్ రకం బియ్యాన్ని అందుబటులో ఉంచే అంశాన్ని పరిశీలించాలన్నారు. అలాగే ఉల్లిపాయల సరఫరాను మరింత పెంచి, సామాన్యులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
Also Read
- CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
- AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
- Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
- Coimbatore Blasts: 19 పేలుళ్లు, 58 మంది మృతి.. కోయంబత్తూర్ పేలుళ్ల నిందితులకు విజయ్ సర్కార్ పెరోల్.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పీఎం సూర్యఘర్ కింద ఇళ్లపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటులో మరింత పురోగతి సాధించాలని, ప్రస్తుతం జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో ఉన్నామని.. దీన్ని మరింత మెరుగుపరుచుకోవాలన్నారు. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా తొమ్మిది లక్షల కనెక్షన్లను ఏర్పాటు చేయాలని, వీటిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేలా కార్యాచరణ అమలు చేయాలని సీఎం సూచించారు. ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పాలనలో టెక్నాలజీని పూర్తిగా ఉపయోగించుకుని ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే తక్షణమే సరిదిద్దుకోవాలని సీఎం పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మరింత మెరుగ్గా జరగాలన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
-
Coimbatore Blasts: 19 పేలుళ్లు, 58 మంది మృతి.. కోయంబత్తూర్ పేలుళ్ల నిందితులకు విజయ్ సర్కార్ పెరోల్.
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!