Holiday declared for schools in Tamil Nadu due to Heavy Rains: తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదివారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. నాగపట్నంలో అయితే ఏకంగా 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8.30 గంటల నుండి జనవరి 8 ఉదయం 5.30 గంటల వరకు 16.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. కరైకల్ (12.2 సెం.మీ.), పుదుచ్చేరి (9.6 సెం.మీ.), కడలూరు…
పొంగల్ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పొంగల్ సందర్భంగా ప్రజలకు రూ.1000 నగదును కానుకగా అందజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 15న పొంగల్ పండుగ జరుపుకోనున్న సంగతి తెలిసిందే.
Insurance Money: డబ్బుల కోసం స్నేహితుడినే కడతేర్చాడు ఓ వ్యక్తి. ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసేందుకు ఫ్రెండ్‌ని చంపేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చోటు చేసుకుంది. చెన్నైలో తన పేరిట ఉన్న రూ.1 కోటి ఇన్సూరెన్స్ డబ్బును పొందేందుకు తాను మరణించినట్లుగా డ్రామా క్రియేట్ చేసి, తన పోలికలతో ఉన్న మరో వ్యక్తిని హత్య చేశాడు. ఈ కేసులో ఇద్దరు నిందితుడితో సహా అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం తమిళనాడు, లక్షద్వీప్‌లలో పర్యటించనున్నారు. ప్రధాన మంత్రి తన పర్యటన సందర్భంగా రెండు రాష్ట్రాలలో అనేక అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
Ammonia Gas Leak In Tamil Nadu: తమిళనాడులోని ఎన్నూర్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్ కలకలం రేపింది. ఎన్నూరులో ఓ ప్రైవేట్ కంపెనీసబ్ సీ పైపులో మంగళవారం అర్థరాత్రి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అమ్మోనియా సరఫరాను నిలిపివేశారు. అయితే గ్యాస్ లీకేజీతో సంఘటనా స్థలంలో ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమ్మోనియా వాసనను పీల్చడం వల్ల మరి కొంత మంది స్వల్ప…
Chennai: తమిళనాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని హత్య దేశవ్యాప్తంగా సంచలం సృష్టించింది. నందిని కోసం ట్రాన్స్‌జెండర్‌గా మారిన వ్యక్తి వెట్రిమారన్ ఈ హత్యకు పాల్పడ్డాడు. చెన్నై సమీపంలోని ధాలంపూర్ పొన్నార్ గ్రామం పక్కన ఉన్న వేదగిరి నగర్ లో అత్యంత దారుణంగా హత్య చేశాడు. యువతి చేతుల్ని కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పటించారు. తీవ్రగాయాల పాలైన నందిని స్థానికులు గమనించి దళంపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలించి, చికిత్స చేస్తున్న క్రమంలో నందిని మరణించింది.
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ఆలయ కమిటీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. రామాలయ ప్రారంభానికి నెల రోజులే సమయం ఉండటంతో తమిళనాడు నమక్కల్ నుంచి 42 గుడి గంటలు అయోధ్యకు బయలుదేరాయి. భారీ లారీలో వీటిని తరలిస్తున్నారు. గుడి గంటలను చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఈ గుడి గంటలు…
DMK MP Dayanidhi Maran: ఉత్తరాది వాళ్ల గురించి మరోసారి డీఎంకే పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడే వాళ్లు తమిళనాడులో టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు ఆర్జేడీ నేత, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఫైర్ అవుతున్నారు.
Tamil Nadu Floods: భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. వర్షాలు తగ్గినప్పటికీ, ప్రజల్ని కష్టాలు వీడటం లేదు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు గత వారం కురిసిన వర్షాలకు చాలా ప్రభావితమైంది. తూత్తుకూడి ప్రాంతం దారుణంగా దెబ్బతింది. వరదల ధాటికి కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ ప్రాంతంలో కొత్త సమస్యలు మొదలయ్యాయి.