Matrimonial site: ఇటీవల కాలంలో మాట్రిమోనియల్ సైట్లలో పరిచయాలు మోసాలకు కారణమవుతున్నాయి. అమ్మాయిలకు మంచి వరుడిని తెవాలనే తల్లిదండ్రులు తపన కొందరు దుర్మార్గులకు ఆసరాగా మారుతోంది. ఉద్యోగం లేకున్నా, తనకు మంచి ఉద్యోగం, కోట్లలో ఆస్తులు ఉన్నాయని ఫోజ్ ఇస్తూ యువతులను వలలో వేస్తున్నారు. అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు కూడా ముందు వెనక ఆలోచించకుండా వారి చేతుల్లో మోసపోతున్నారు.
Read Also: Ram Mandir: రామ మందిర వేడుక వేళ.. 100కి పైగా సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన కేంద్రం..
తాజాగా తమిళనాడు తంజావూర్ జిల్లాలో కూడా ఇలాంటి మోసమే వెలుగులోకి వచ్చింది. జిల్లాకు చెందిన 36 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మహిళను మోసం చేసి రూ.3 లక్షలు, 120 గ్రాముల బంగారంతో ఉడాయించాడు. తాజాగా ఈ కేసులో నిందితుడు సిబిచక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మహిళ వితంతువు కావడంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బు, నగలు ఇచ్చేలా మహిళను మోసం చేశాడు. సిబిచక్రవర్తి కేవలం 12వ తరగతి మాత్రమే చదివినప్పటికి ఇంజనీర్‌నని పేర్కొంటూ మ్యాట్రిమోనియల్ సైట్‌లో తప్పుగా చూపించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వితంతు మహిళను లక్ష్యంగా చేసుకుని, పెళ్లి చేసుకుంటానని తన వలలో వేసుకుంటున్నాడని, ప్రొఫైల్‌లో తప్పుడు ఫోటోలు ఉపయోగించి మహిళల్ని మోసం చేస్తున్నట్లు తెలిసింది. ఇదే కాకుండా ఇతనిపై పలు పెండింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఫోన్ పరిశీలించగా మొత్తం 80 మంది స్త్రీల ఫోటోలు వెలుగులోకి వచ్చాయి.