Indian Fishermen: శ్రీలంక మరోసారి భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసింది. తమిళనాడు రామేశ్వరానికి చెందిన 23 మంది మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో వీరి అరెస్ట్ జరిగింది. 23 మంది జాలర్లను అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నేవీ అధికారులు ఆదివారం తెలిపారు. పార్క్ బే సముద్ర ప్రాంతంలోని డెల్ఫ్ట్ ద్వీపం సమీపంలో మత్స్యకారులు చేపలు పట్టినట్లు మత్స్యకార సంఘం పేర్కొంది.
Read Also: Ambati Rambabu: సీట్ల కోసం భేటీ అయ్యారో.. నోట్ల కోసం భేటీ అయ్యారో.. చంద్రబాబు-పవన్ భేటీపై సెటైర్లు
శ్రీలంక నేవీ అక్కడికి చేరుకుని రామేశ్వరానికి చెందిన జాలర్లను అరెస్ట్ చేసి విచారణ కోసం జాఫ్నాలోని మైలాటి నేవల్ క్యాంపుకు తీసుకెళ్లింది. గత నెలలో ఇలానే శ్రీలంక 18 భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. లంక సముద్ర జలాల్లో రెండు బోట్లను స్వాధీనం చేసుకుంది. గత కొంత కాలంలో ఇలా శ్రీలంక జాలర్లను అరెస్ట్ చేస్తుండటంపై తమిళనాడు సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతేడాది జూలైలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే భారత పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా ప్రధాని నరేంద్రమోడీ, ఆయన మధ్య భేటీలో ఈ అంశం చర్చకు వచ్చింది.