Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. తమిళనాడులోని సేలం-వృద్ధాచలం హైవేపై నరైయూర్ వద్ద శనివారం కారు, సిమెంట్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు విడుతలై చిరుతిగల్ కట్చి (VCK) కార్మికులు మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం తిరుచ్చి సమీపంలోని సిరుగనూర్‌లో జరిగిన పార్టీ సమావేశానికి హాజరైన 25 మంది వీసీకే కార్యకర్తలు వ్యాన్‌లో కడలూరు జిల్లా భువనగిరి సమీపంలోని విలియనూర్‌కు తిరిగి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also:Australian Open 2024: సబలెంకదే ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్.. రెండో ప్లేయర్‌గా రికార్డు!
తెల్లవారుజామున 2.50 గంటల సమయంలో వాహనం నరైయూర్ సమీపంలో ఉండగా, డ్రైవర్ వాహనంపై నియంత్రణ తప్పి ఎదురుగా వస్తున్న గూడ్స్ లారీని ఢీకొట్టింది. వేప్పూర్ నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వృద్ధాచలం, వేప్పూర్, పెరంబలూరు ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. లారీ డ్రైవర్ సెంథిల్ గవాస్కర్‌ను పాండిచ్చేరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)కు రిఫర్ చేశారు. వ్యాన్ డ్రైవర్ ఎస్.చిరంజీవిని తిరుచ్చి జీహెచ్‌కి రిఫర్ చేశారు.
Read Also:Bihar Political Crisis : నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నితీష్ కుమార్.. ముమ్మరంగా ఏర్పాట్లు