Parasakthi: తమిళనాడులో పొంగల్ బరిలో నిలిచిన సినిమాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే స్టార్ హీరో విజయ్ నటించిన ‘‘జన నాయగన్’’ సెన్సార్ కష్టాలను ఎదుర్కొంటోంది. తాజాగా మరో శివకార్తికేయన్ ‘‘పరాశక్తి’’ సినిమాపై వివాదం ముదురుతోంది. కాంగ్రెస్కు సంబంధించిన చారిత్రక సంఘటనలను వక్రీకరించారని ఆరోపిస్తూ, పరాశక్తి సినిమాపై బ్యాన్ విధించాలని తమిళనాడు యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. 1960లలో విద్యార్థి ఉద్యమం, హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో పరాశక్తి తెరకెక్కింది. ఈ సినిమా జనవరి 10న థియేటర్లలోకి వచ్చింది.…
టీవీకే అధినేత, నటుడు విజయ్ ఢిల్లీలో సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. తమ ఎదుట హాజరుకావాలని ఇటీవల సీబీఐ సమన్లు జారీ చేసింది. దీంతో సోమవారం ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి చేరుకున్న ఆయన సీబీఐ ముందు హాజరయ్యారు.
టీవీకే చీఫ్, నటుడు విజయ్కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. జనవరి 12న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ సీబీఐ ప్రధాన కార్యాలయంలో విజయ్ను విచారించే అవకాశం ఉంది.
తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగింపుపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆలయ దేవస్థానం తప్పనిసరిగా దీపం వెలిగించాలని న్యాయస్థానం ఆదేశించింది.
అమెరికాలో హైదరాబాద్ యువతి నిఖితారావు గొడిశాలను హత్య చేసి భారత్కు పారిపోయి వచ్చిన నిందితుడు అర్జున్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో తమిళనాడులో ఇంటర్పోల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Chennai: చెన్నెలోని తలపతి వీధి పక్కన ఉన్న కుంద్రత్తూర్ లోని మూడవ వార్డులో విజయ్ (25) అనే యువకుడు అద్దె ఇంట్లో ఉంటున్నాడు. విజయ్ చెన్నెలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు. తనతో పాటు పనిచేసే యువశ్రీ (24) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ప్రేమించాడు. ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకుని కుంద్రత్తూర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. స్మార్ట్వాచ్తోనే షాపింగ్ పేమెంట్స్.. బోట్ ‘వేవ్ ఫార్చ్యూన్’ ధమాకా ఫీచర్లు..! రాత్రి…
Tamil Nadu Deepam Row: తమిళనాడులోని తిరుపరంకుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయంలో దీపం వెలిగింపు వివాదం, ఆ రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మద్రాస్ హైకోర్టు కొండపై ఉన్న ఆలయం వద్ద దీప వెలిగించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. దీంతో భక్తులు బలవంతంగా కొండపైకి వెళ్లి దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయడంతో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇదిలా ఉంటే, ఈ వివానానికి కారణంగా ఉన్న దర్గాపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దర్గాలో…
Viral Video: దేశంలో ప్రతిరోజు అనేకచోట్ల ప్రజల వద్ద నుంచి అక్రమంగా లేదా సరైన లెక్కలు లేని ధనాన్ని పోలీసులు చెకింగ్ సమయంలో సీజ్ చేయడం చూసే ఉంటారు. ఇలాంటివి ఎక్కువగా ఎన్నికల సమయంలో కనబడుతుంటాయి. ప్రతిరోజు అనేకమంది వారికి వ్యాపారాల నిమిత్తం లేదా వేరే అవసరాలకైనా పెద్ద మొత్తంలో కొందరు డబ్బులను ఒకచోటి నుంచి మరొక చోటికి తరలిస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించి సరైన ఆధారాలు లేదా బిల్లులను చూపిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా…
దక్షిణ భారత్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు పలు కుటుంబాల్లో ఘోర విషాదాన్ని నింపాయి. గంటల వ్యవధిలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పెను విషాదాలు చోటుచేసుకున్నాయి. ఎప్పుడు ముప్పు వస్తుందో ఎవరు చెప్పలేరని అనడానికి ఈ ప్రమాదాలే ఉదాహరణలు. గమ్యానికి చేరుకునేలోపే మృత్యువు రోడ్డుప్రమాదాల రూపంలో రావడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.