DMK MP Dayanidhi Maran: ఉత్తరాది వాళ్ల గురించి మరోసారి డీఎంకే పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడే వాళ్లు తమిళనాడులో టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు ఆర్జేడీ నేత, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఫైర్ అవుతున్నారు.
Tamil Nadu Floods: భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు అతలాకుతలం అవుతోంది. వర్షాలు తగ్గినప్పటికీ, ప్రజల్ని కష్టాలు వీడటం లేదు. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు గత వారం కురిసిన వర్షాలకు చాలా ప్రభావితమైంది. తూత్తుకూడి ప్రాంతం దారుణంగా దెబ్బతింది. వరదల ధాటికి కొన్ని గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ ప్రాంతంలో కొత్త సమస్యలు మొదలయ్యాయి.
Tamilnadu : తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎక్కడ చూసినా నీరు కనిపిస్తుంది. ఈ విపత్తు కారణంగా ప్రజల జీవనం కష్టంగా మారింది.
Heavy Rain Hits Tamil Nadu: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం తమిళనాడులోని దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి మరియు కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయంగా మారడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు బ్యాంకులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తూత్తుకుడి జిల్లాలోని…
శబరిమలకు అయ్యప్ప దర్శనానికి వెళ్తూ.. అనంత లోకాలకు వెళ్లారు. స్వామి దర్శనం చేసుకోకుండానే.. మధ్యలోనే వారిని మృత్యువు వెంటాడింది. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన అయ్యప్ప స్వాములు ముగ్గురు మృతి చెందారు.
తమిళనాడులో హిందీ భాష మరోసారి వివాదంగా మారింది. గోవా విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బంది, హిందీ రాకపోవడంతో ఓ తమిళ యువతిపై అనుచితంగా ప్రవర్తించడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఖండించారు. హిందీ భారతదేశ జాతీయభాష కాదని, ప్రజలు బలవంతంగా దీనిని నమ్మేలా చేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.
ఇంద్రజిత్ పోరాడినప్పటికీ మిగిలిన ఆటగాళ్లు విఫలం కావడంతో తమిళనాడు లక్ష్య ఛేదనలో 230 రన్స్ కు ఆలౌటైంది. దీంతో 64 పరుగుల తేడాతో హర్యానా విజయం సాధించింది.
DMDK President Vijayakanth Discharged from hospital: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు, కెప్టెన్ విజయ్‌కాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. పూర్తిగా కోలుకోవడంతో సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. 71 ఏళ్ల విజయ్‌కాంత్ అనారోగ్య కారణాల వల్ల నవంబర్ 18న ఆసుపత్రిలో చేరారు. 23 రోజుల తర్వాత కోలుకున్న కెప్టెన్.. నేడు చెన్నైలోని తన నివాసానికి వెళ్లిపోయారు. విషయం తెలిసిన విజయ్‌కాంత్ ఫాన్స్, డీఎండీకే కార్యకర్తలు సంతోషం…
Rain Alert: తమిళనాడు రాష్ట్రం వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే మిచౌంగ్ తుఫాన్ ధాటికి చెన్నై సముద్రాన్ని తలపిప్తోంది. ఎక్కడా చూసినా వరద నీరు, బురదమయైంది. భారీ వర్షాల కారణంగా చెన్నైలో ప్రజల జీవితం దెబ్బతింది. డిసెంబర్ 4న కురిసిన భారీ వర్షాల కారణంగా ఇప్పటికే అనేక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. నగర వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి.