Crime News: తమిళనాడులో దారుణం.. బస్సులోంచి గర్భిణిని తోసేసిన భర్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Pushed His Pregnant Wife from Running Bus in Tamil Nadu: గర్భంతో ఉన్న భార్యను కట్టుకున్న భర్తే కదులుతున్న బస్సులో నుంచి కిందకు తోసేశాడు. గర్భంతో ఉన్న మహిళ రోడ్డుమీద పడి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఆదివారం (జనవరి 28) చోటుచేసుకుంది. భార్య మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వెంబార్‌పట్టికి చెందిన వెళ్లమెయ్యన్ కుమారుడు పాండియన్ (24), కల్‌వెలిపట్టికి చెందిన బాలమురుగన్ కుమార్తె వలర్మతికి (19) ఎనిమిది నెలల కిందట వివాహమైంది. వలర్మతి ప్రస్తుతం 5 నెలల గర్భిణి. దంపతులు ఇద్దరు ఆదివారం దిండిగల్ నుంచి పొన్నమరావతికి వెళ్లేందుకు గోపాల్‌పట్టి బస్టాండులో బస్సు ఎక్కారు. మద్యం మత్తులో ఉన్న పాండియన్.. గర్భిణి అయిన వలర్మతితో గొడవపడ్డాడు. గొడవ పెద్దదైంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న పాండియన్.. కనవాయిపట్టి సమీపంలో కదులుతున్న బస్సులోంచి తన భార్యను తోసేశాడు. రోడ్డుపై పడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Also Read: Kumari Aunty: ‘కుమారి ఆంటీ’ ఫుడ్ బిజినెస్ క్లోజ్.. కారణం ఏంటో తెలుసా?
బస్సు ఆపిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వలర్మతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం దిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందుతుడు పాండియన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. ఈ దారుణ ఘటనపై వలర్మతి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!