తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ ప్రతులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి పక్కన పెట్టారు. నేటి ఉదయం 10 గంటలకు ప్రసంగం మొదలు పెట్టిన ఆయన రెండు నిముషాల్లోనే తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.
Coimbatore Car Blast: 2022లో ఐఎస్ఐఎస్ ప్రేరేపిత కోయంబత్తూర్‌లో కారు బాంబు పేలుడు, ఐసిస్ రాడికలైజేషన్, రిక్రూట్మెంట్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వేగం పెంచింది. తమిళనాడులోని 21 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసింది. శనివారం నిర్వహించిన యాంటీ టెర్రర్ ఏజెన్సీ సెర్చ్ ఆపరేషన్‌లో భారీ సంఖ్యలో ఎలక్ట్రానిక్ పరికరాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆరు ల్యాప్‌టాపులు, 25 మొబైల్ ఫోన్లు, 34 సిమ్ కార్డులు, ఆరు ఎస్డీ…
తమిళనాడులో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.
First Trangender Railway Ticket Inspector: దక్షిణ భారతదేశంలో తొలిసారిగా రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా తమిళనాడుకు చెందిన సింధు అనే ట్రాన్స్‌జెండర్ నియమితులయ్యారు. ట్రాన్స్‌జెండర్ సింధు నాగర్‌కోవిల్‌కు చెందిన వారు. ఈమె తమిళ సాహిత్యంలో బి.లిటరేచర్ చేశారు. ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని సింధు అన్నారు. హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరుకున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. హిజ్రాలు తమ సమస్యలతో కుంగిపోకుండా.. విద్య, శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని…
నిధుల కేటాయింపులో వివక్ష, నిర్లక్ష్యంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా కేరళ, తమిళనాడు తమ పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో కలిసి నిరసన వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా కేరళకు చెందిన లెఫ్ట్ ఫ్రంట్, తమిళనాడు డీఎంకే గురువారం ఢిల్లీలో నిరసనలు చేపట్టనున్నాయి.
తమిళనాడు కాంగ్రెస్‌లో అంతర్గత పోరు కొనసాగుతుంది. దీంతో కాంగ్రెస్ మాజీ హోంమంత్రి, పి.చిదంబరం కుమారుడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలే స్వయంగా ఉద్యమిస్తున్నారు.
Indian Fishermen: శ్రీలంక మరోసారి భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసింది. తమిళనాడు రామేశ్వరానికి చెందిన 23 మంది మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో వీరి అరెస్ట్ జరిగింది. 23 మంది జాలర్లను అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నేవీ అధికారులు ఆదివారం తెలిపారు. పార్క్ బే సముద్ర ప్రాంతంలోని డెల్ఫ్ట్ ద్వీపం సమీపంలో మత్స్యకారులు చేపలు పట్టినట్లు మత్స్యకార సంఘం పేర్కొంది.
Husband Pushed His Pregnant Wife from Running Bus in Tamil Nadu: గర్భంతో ఉన్న భార్యను కట్టుకున్న భర్తే కదులుతున్న బస్సులో నుంచి కిందకు తోసేశాడు. గర్భంతో ఉన్న మహిళ రోడ్డుమీద పడి అక్కడిక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఆదివారం (జనవరి 28) చోటుచేసుకుంది. భార్య మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.…
Google Maps: ఇటీవల కాలంలో గూగూల్ నావిగేషన్ మ్యాప్స్ని నమ్ముకుని కొంతమంది ప్రయాణాలను కొనసాగిస్తే ప్రమాదాలు ఎదురయ్యాయి. ఇటీవల కేరళలో గూగుల్ మ్యాప్స్ ద్వారా కారు నడుపుతుంటే, అది కాస్త నదిలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో మరణాలు సంభవించాయి. మరికొన్ని సందర్భాల్లో దగ్గరి మార్గం కోసం నావిగేషన్ని నమ్ముకుంటే, తెలియని ప్రాంతాలకు తీసుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. తమిళనాడులోని సేలం-వృద్ధాచలం హైవేపై నరైయూర్ వద్ద శనివారం కారు, సిమెంట్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి.