IND vs WI Super 8: ఈడెన్ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!
- సూపర్ 8 మ్యాచ్‌లో తలపడనున్న భారత్, వెస్టిండీస్
- ఇరు జట్లకు చావో రేవో లాంటి మ్యాచ్
- ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌కు అద్భుత రికార్డు
- భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Have Bowling Issue Ahead of IND vs WI Super 8 Match: టీ20 ప్రపంచకప్ 2026లో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. గ్రూప్-1 సూపర్ 8 మ్యాచ్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ నేడు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చావో రేవో లాంటిది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ సెమీ ఫైనల్‌కు చేరుతుంది, ఓడిన జట్టు టోర్నీ నుంచి బయటికి వెళ్లిపోతుంది. భారత్, వెస్టిండీస్ జట్ల బ్యాటింగ్ బలంగా ఉండడంతో ఈ పోరు చాలా ఆసక్తి కలిగిస్తోంది. క్వార్టర్ ఫైనల్ లాంటి ఈ సూపర్ 8 మ్యాచ్‌లో ఏ టీమ్ ఆధిపత్యం చెలాయిస్తుందో చూడాలి. ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాకు మంచి రికార్డు ఉన్నా.. ఓ సమస్య మాత్రం సూర్య సేనను వేధిస్తోంది.
1983 నుంచి ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌కు అద్భుత రికార్డు ఉంది. ఇప్పటివరకు ఏ అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ టీమిండియాను వెస్టిండీస్ ఓడించలేదు. ఈడెన్‌లో విండీస్‌తో ఆడిన నాలుగు టీ20 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. అయితే ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఈరోజు భారీ స్కోర్లు నమోదు కావొచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ 2026లో ఇటలీపై స్కాట్లాండ్ 207 పరుగులు చేసింది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న విండీస్ భారీ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియాకు బౌలింగ్ ఇంకా సమస్యగానే ఉంది. బుమ్రా, అర్షదీప్ మినహా అందరూ భారీగా రన్స్ ఇస్తున్నారు. సూపర్ 8 మ్యాచ్‌లలో హార్దిక్, వరుణ్, అక్షర్, దూబే ఎక్కవగా రన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బంతితో పుంజుకోవడం టీమిండియాకు చాలా ముఖ్యం.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read: Pakistan Trolls: మార్పు అవసరమా?.. జిత్తుల మారి ‘నక్వీ’ కారణంగానే పాకిస్థాన్ ఓటములు!
బ్రెండన్ కింగ్, షై హోప్, షిమ్రాన్ హెట్‌మయర్ టాపార్డర్‌లో రెచ్చిపోతున్నారు. హెట్‌మయర్ మూడో స్థానంలో ఆడడం కూడా వెస్టిండీస్‌కు సత్ఫలితాలనిస్తోంది. రోమన్ పావెల్, రోస్టన్ చేజ్, రూథర్‌ఫర్డ్ మిడిల్ ఆర్డర్‌లో పరుగులు చేస్తున్నారు. దక్షిణాఫ్రికాపై 9వ స్థానంలో వచ్చిన షెపర్డ్ అర్ధ శతకం చేశాడంటే.. విండీస్ బ్యాటింగ్ లోతు ఎంతుందో అర్ధం చేసుకోవచ్చు. విండీస్ హిట్టర్లను అడ్డుకోవాలంటే.. టీమిండియా బౌలర్లు శ్రమించాల్సిందే. స్పిన్నట్లు తేలిపోతున్న వేళ.. పేసర్లు బుమ్రా, అర్షదీప్ ఎలా రాణిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!