Abhishek Sharma: “అభిషేక్ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma: భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. భారత్ ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని అని 140 కోట్ల మంది కోరుకుంటున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లోనూ ఓపెనర్ అభిషేక్ శర్మ నిరాశ కనబరిచాడు. 196 లక్ష్యాన్ని ఛేదించడానికి రంగంలోకి దిగిన టీమిండియాకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఈ సారి కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. అభిషేక్ శర్మ మిడిల్, లెగ్ వైపు వచ్చిన షార్ట్ బంతిని పుల్ చేయబోయి టైమింగ్ కోల్పోయాడు. బంతి నేరుగా దీప్ స్క్వేర్ లెగ్‌లో షిమ్రోన్ హెట్‌మైర్ వైపునకు వెళ్లింది. హెట్‌మైర్ ఈజీగా క్యాచ్ పట్టాడు. దీంతో అభి 11 బంతుల్లో 10 పరుగులతో వెనుదిరిగాడు. మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ 29కి 1 వికెట్ కోల్పోయింది. ఒక్కసారిగా మైదానంలో నిశ్శబ్దం నెలకొంది. ఇటు ఫీల్డింగ్‌లోనూ అభి ఫెయిల్ అయ్యాడు. రెండు క్యాచ్‌లు వదిలేశాడు.. ముఖ్యంగా రోస్టన్ చేజ్ క్యాచ్ మిస్ చేయడం భారీ తప్పదంగా మారింది.
READ MORE: India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)
Also Read
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
జింబాబ్వేతో జరిగిన డూ-ఆర్-డై మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విశ్వరూపం చూపించాడు. టోర్నీ ఆరంభం నుంచి వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న అభిషేక్, ఈ కీలక మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని తన సత్తా చాటాడు. తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా భారీ అంచనాల మధ్య టోర్నీలోకి అడుగుపెట్టిన అభిషేక్, మొదటి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయి, దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక పోరులో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే, జింబాబ్వేపై ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో అతను తిరిగి ఫామ్‌లోకి రావడం భారత అభిమానులకు ఊరటనిచ్చింది. కానీ.. వెస్టిండీస్ మ్యాచ్‌లో మాత్రం మళ్లీ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఈ ఓపెనర్ ఫామ్‌పై సోషల్ మీడియాలో ఒక్కసారిగా చర్చలు మొదలయ్యాయి. అతడిని జట్టులో నుంచి తప్పించాలని అభిమానులు పెద్ద ఎత్తున పోస్ట్‌లు చేశారు. మరికొందరు అభిషేక్ ఆత్మవిశ్వాసం తగ్గిందని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు “సహజ ఆటశైలిని కొనసాగించాలి కానీ ప్రత్యామ్నాయ ప్రణాళిక సైతం అవసరం” అని చెబుతున్నారు. “అభిషేక్ శర్మ తప్పించండి.. టీమ్‌కు భారంగా మారుతున్నాడు.. ప్రదర్శన అస్సలు బాగాలేదు. అభీకీ బదులుగా రింకూ సింగ్‌తో ఓపెన్ చేయండి.” అంటూ ఓ అభిమాని పోస్ట్ చేశాడు. వరల్డ్ కప్ మ్యాచ్‌లో కేవలం పది పరుగులు సాధించి, రెండు క్యాచ్‌లు మిస్ చేయడం దారుణం.. బౌలర్లకు అభీ క్షమాపణలు చెప్పాలనే డిమాండ్స్ వస్తున్నాయి. కొందరు మాత్రం సపోర్టుగా పోస్టులు పెడుతున్నారు.
Abhishek Sharma should sit down, he's just becoming a burden and not performing. Instead open with Rinku Singh to start with in place of Abhishek Sharma.
— CA Nitin Agrawal 🇮🇳 (@CANitinAgrawal4) March 1, 2026
Abhishek Sharma should be dropped asap, he is low in confidence, there are many talented players waiting in line for an opportunity #INDvsWI
— anurag (@aanurag038) March 1, 2026
Fifty in the previous game to end a rut, but Abhishek Sharma falls here for a 11-ball 10
LIVE 👉 https://t.co/nAvSMDluyM pic.twitter.com/AqG4Jq2uFe
— ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2026
The inexperience of #AbhishekSharma has been properly exploited by all the teams in this World Cup. They were literally toying with his ego and got his wicket everytime. He need not change his natural game but he definitely needs a Plan B for when things aren't going his way.
— Meher Kilaru (@Kilaruness) March 1, 2026
తాజావార్తలు
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!