ఇండియాలో కరోనా కేసులు తక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇటీవల కొన్ని రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోజూ వారీ కేసుల సంఖ్య కూడా మూడు వేలకు లోపే నమోదు అవుతున్నాయి. అయితే ఇటీవల మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. చైనా, హాంకాంగ్, నార్త్ కొరియా, సౌత్ కొరియా వంటి దేశాల్లో ఇటీవల కరోనా కేసులు పెరిగినా… ఇండియాలో మాత్రం గత ఫిబ్రవరి నుంచి కేసుల తీవ్రత ఎక్కువగా లేదు. ఇదిలా ఉంటే తాజాగా…
ప్రస్తుతం ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే 11 దేశాల్లో 80 కేసులు గుర్తించగా… మరో 50 కేసులు పరిశీలనలో ఉన్నాయి. ఇటీవల మే మొదటివారంలో బ్రిటన్ లో ఓ వ్యక్తిలో వైరస్ కనుకున్నారు. నైజీరియా నుంచి బ్రిటన్ కు వచ్చిన వ్యక్తిలో వైరస్ ను కనుక్కున్నారు. తాజాగా మే 18న యూఎస్ఏలో కూడా ఒక కేసు బయటపడింది. దీంతో ప్రపంచ ఆరోగ్య కేంద్రం ( డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఇప్పటికే యూకే, యూఏస్ఏ, పోర్చుగల్,…
దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాధి దాదాపుగా తగ్గుముఖం పట్టింది. కేవలం మూడు వేలకు లోపే కేసులు నమోదు అవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. సెకండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ లో కరోనా ప్రభావం దేశంపై తక్కవనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పెంచడం కూడా వ్యాధి వ్యాప్తి, మరణాల రేటు తగ్గించడానికి సహాయ పడ్డాయి. ప్రస్తుతం దేశంలో కేవలం 15044 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా…
ఉత్తర కొరియా ఓ రహస్య దేశం. ప్రపంచంలో ఏం జరుగుతుందో నార్త్ కొరియా ప్రజలకు… నార్త్ కొరియాలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియడం చాలా తక్కువ. అక్కడ కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే వేదం, చేసిందే చట్టం. వింతవింత రూల్స్, చిత్ర విచిత్రంగా ఉండే దేశం ఉత్తర కొరియా. ఇదిలా ఉంటే ఇప్పుడు అలాంటి దేశాన్ని కరోనా భయపెడుతోంది. కిమ్ రాజ్యంలో కోవిడ్ -19 తీవ్రంగా విజృంభిస్తోంది. ఎంతలా అంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఈ…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. పేద, ధనవంతులు, అధికారం, హోదాలు అడ్డుకాదని నిరూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తెలిపింది. ప్రధానితో పాటు కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. ముందుగా ప్రధాని జెసిండాకు కాబోయే భర్త క్లార్క్ గేఫోర్డ్ కు కరోనా…
చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ఈ మహమ్మారి గుప్పిట చిక్కి చాలా నష్టపోయాయి. ఆరోగ్య పరంగా, ఆర్థికంగా పలు దేశాలు కుదేలయ్యాయి. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు తన రూపాలను మార్చుకుంటూ వస్తోంది కరోనా. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ ఇలా కొత్త వేరియంట్ల రూపంలో దాడి చేస్తూనే ఉంది. అమెరికా, యూరప్ వంటి డెవలప్ దేశాలు కూడా కరోనా ధాటికి విలవిల్లాడాయి. ఏకంగా అమెరికాలో కరోనా…
చైనా వూహాన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రభావం చూపించింది. దేశాల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసింది. ఇప్పటికీ ఏదో రూపంలో కరోనా మహమ్మారి ప్రజలను భయపెడుతూనే ఉంది. తన రూపాలను మార్చుకుంటూ… ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్, ఓమిక్రాన్ ఎక్స్ఈ ఇలా కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలో మాత్రం కరోనా కేసుల…
దేశంలో కరోనా కేసులు… మళ్లీ పెరుగుతున్నాయి. కొంతకాలంగా బాగా తగ్గిన పాజిటివిటీ రేటు… అనూహ్యంగా పెరుగుతోంది. ఇక, ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌ఈ మొదటి కేసు వెలుగులోకి వచ్చింది. అత్యంత సాంక్రమిక శక్తి ఉన్నట్లు భావిస్తోన్న… ఈ వేరియంట్ గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. తాజాగా వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించే ల్యాబొరేటరీల ఇన్సాకాగ్… ఎక్స్‌ఈ వేరియంట్‌పై క్లారిటీ ఇచ్చింది. BA.2.10, BA.2.12.. BA.2 ఉప రకాలుగా గుర్తించినట్లు నిపుణులు తెలిపారు. BA.2 పాత సీక్వెన్సులే కొత్త వాటిగా…
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు మంత్రి ఆర్‌కె రోజా. నేను మంత్రి అయ్యాక తొలిసారిగా సీఎం జగన్ ఈనెల 5వ తేదీ పర్యటనకు రావడం సంతోషం. గత ప్రభుత్వం హయాంలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారు. సీఎం జగన్ మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. 1800 కోట్లు ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి చంద్రబాబు వెళ్ళిపోయారు. సీఎం జగన్ చెల్లించమే కాకుండా, ప్రతి మూడు నెలలకు…
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది.. కఠిన నిబంధనలు పాటిస్తోంది.. అయితే, కరోనా నిబంధనల పేరుతో అధికారులు ప్రదర్శించి అత్యుత్సాహం విమర్శలకు దారితీసింది. షాంఘై సిటీలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తోన్న విషయం తెలిసిందే కాగా.. ప్రజలు క్వారెంటైన్కే పరిమితం కావాల్సిన పరిస్థితులు దాపురించాయి.. ఇదే సమయంలో, కోవిడ్ నెగిటివ్గా ఫలితం వచ్చినవాళ్లను కూడా సిటీకి దూరంగా ఏర్పాటుచేసిన పాక్షిక నివాస కేంద్రాలకు తరలిస్తున్నారని సమాచారం. షాంఘై సిటీలో 2.5 కోట్ల జనాభా ఉండగా..…