మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు మంత్రి ఆర్‌కె రోజా. నేను మంత్రి అయ్యాక తొలిసారిగా సీఎం జగన్ ఈనెల 5వ తేదీ పర్యటనకు రావడం సంతోషం. గత ప్రభుత్వం హయాంలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారు. సీఎం జగన్ మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు.
1800 కోట్లు ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి చంద్రబాబు వెళ్ళిపోయారు. సీఎం జగన్ చెల్లించమే కాకుండా, ప్రతి మూడు నెలలకు ఒకసారి బకాయిలు చెల్లిస్తున్నాం. గతంలో నారకాసుర ఆంధ్రప్రదేశ్ గా అనిపించింది కాబట్టే చంద్రబాబుని దించి జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. మహిళలపై దాడులు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ లో మూడు శాతం తగ్గాయన్నారు రోజా. కొంత మంది ఉన్మాదుల వల్ల జరిగే ఘటనలకు కఠిన శిక్ష విధిస్తున్నారు.
మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి కనిపిస్తోంది. బాదుడే బాదుడు..అంటూ వ్యాట్, విద్యుత్ ఛార్జీలు పెంచలేదా చంద్రబాబు అని ప్రశ్నించారు మంత్రి రోజా. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు చూస్తే, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. డిస్కంలకు చంద్రబాబు హయాంలో 28వేల కోట్లు బకాయిలు పెట్టారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచారు. ధరలు కొద్దిగా పెంచిన దానికి ఆగమాగం చేస్తున్నారు. సీఎం జగన్ కరోనా కష్ట కాలంలో సంక్షేమ పథకాలను అందించారు.
Police Cruelty: నేలకొండపల్లిలో ఖాకీల ఓవరాక్షన్