భారత్ తో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత రెండు మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా బుధవారం ఒక్క రోజే ఇండియాలో 7 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి దాదాపుగా 3 నెలల తరువాత గరిష్ట స్థాయికి కేసుల సంఖ్య చేరుకుంది. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళలు కరోనా హాట్ స్పాట్స్ గా మారాయి. ఈ మూడు ప్రాంతాల్లోనే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో గురువారం కొత్తగగా 622…
భారత్‌లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 7,240 మంది వైరస్ బారినపడ్డట్లు తేలింది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,723కి చేరింది. బుధవారం 3,591 మంది కోలుకున్నారు.. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.71 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.08 శాతం వద్ద…
కరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేని ప్రయాణికులను బోర్డింగ్‌కు ముందే ఆపాలని ఆదేశించింది. ప్రయాణ సమయమంతా మాస్క్ ధరించి ఉండాల్సిందేనని పేర్కొంది. మాస్క్ లేకుంటే ఎయిర్‌పోర్టులోకి అనుమతించొద్దని సూచించింది. ఈ మేరకు విమాన ప్రయాణికులను హెచ్చరిస్తూ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నూతన మార్గదర్శకాలను బుధవారం జారీ చేసింది. కొవిడ్ సేఫ్టీ నిబంధలను…
కరోనా ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతుందని ఆనందించేలోపు కరోనా కేసులు పెరగడం భయాందోళనకు గురిచేస్తోంది.ఇక ఇప్పుడిప్పుడే చిత్రపరిశ్రమ కొద్దికొద్దిగా కోలుకొంటుంది. పార్టీలు, ఈవెంట్స్ అంటూ కళకళలాడుతున్నాయి.అయితే ఒకేసారి 50 మంది స్టార్లు కరోనా బారిన పడడం షాక్ కు గురిచేస్తోంది. అయితే ఇందుకు కారణం ఒక బర్త్ డే అని తెలుస్తోంది. అది ఎవరిదో కాదు. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ పార్టీ అని సమాచారం. కోవిడ్ వైరస్ ఈ పార్టీలో 50 మంది అతిథులపై…
దేశంలో కార్బెవాక్స్ హెటిరోలాజస్ కోవిడ్-19 వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( డీజీసీఐ) బూస్టర్ డోస్ అనుమతి ఇచ్చింది. దేశంలో తొలిసారిగా బూస్టర్ డోస్ అనుమతి పొందిన హెటెరోలాజస్ డ్రగ్ గా కార్బెవాక్స్ నిలిచింది. హైదరాబాద్ కు చెందిన డ్రగ్ మేకర్ బయోలాజికల్-ఈ సంస్థ కార్బెవాక్ ను తయారు చేస్తోంది. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన అంతకన్నా ఎక్కువ వయసు గల వ్యక్తులు ఈ బూస్టర్ డోస్ తీసుకునేందుకు మార్గం సుగమమైంది. రెండు…
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమె తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నట్లు, స్వల్పంగా జ్వరం ఉన్నట్లు కాంగ్రెస్ అధకార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా ప్రకటించారు. కరోనా నుంచి సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు. కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కోరుకున్నారు. నిన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నేషనల్ హెరాల్డ్…
ఇండియాలో కరోనా తీవ్రత కనిపిస్తోంది. ఓ వైపు కొత్తగా బీఏ4, బీఏ5 వేరియంట్లు భయపెడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణతో పాటు తాజాగా మహారాష్ట్రలో ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ రోజూవారీ కరోనా కేసులను వెల్లడించింది. కేసుల సంఖ్య 3 వేల కన్నా తక్కువగానే ఉన్నా.. గత నాలుగైదు రోజుల నుంచి నెమ్మదిగా కేసులు పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన…
దేశంలో గత కొన్ని రోజుల నుంచి క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 2710 కేసులు నమోదు అయ్యాయి. ఇది గురువారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. నిన్న ఒక్క రోజే మహమ్మారి బారిన పడి 14 మంది మరణించారు. ఇదిలా ఉంటే 24 గంటల్లో 2296 మంది కరోనాను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 15,814 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కరోనా ప్రారంభం అయినప్పటి…
చైనాలో కరోనా 2019 చివర్లో ప్రారంభం అయినా… ఇండియాలో మాత్రం 2020 ఫిబ్రవరి- మార్చి నెలల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే 2021 సెకండ్ వేవ్ లో పెద్ద ఎత్తున ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే 2020 ఏడాదిలో వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాలను బట్టి చూస్తే కరోనా కన్నా ఇతర అనారోగ్య సమస్యలతోనే ప్రజలు ఎక్కువగా మరణించారని తెలుస్తోంది. 2020లో వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాల సంఖ్య దేశంలో 81.15 లక్షలు ఉంటే…
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. జనవరిలో థర్డ్ వేవ్ కారణంగా లక్షల్లో కేసులు నమోదు అయ్యాయి. అయితే థర్డ్ వేవ్ ప్రభావం దాదాపుగా తొలిగిపోవడంతో కేసుల సంఖ్య, వ్యాధి తీవ్రత చాలా వరకు తగ్గింది. ఫిబ్రవరి నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య వేలల్లోనే నమోదు అవుతోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య 3 వేలకు దిగువనే ఉంటున్నాయి. మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం…