COVID variant XE : ఎక్స్‌ఈ వేరియంట్.. పరిశోధనలో సంచలన అంశాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసులు… మళ్లీ పెరుగుతున్నాయి. కొంతకాలంగా బాగా తగ్గిన పాజిటివిటీ రేటు… అనూహ్యంగా పెరుగుతోంది. ఇక, ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌ఈ మొదటి కేసు వెలుగులోకి వచ్చింది. అత్యంత సాంక్రమిక శక్తి ఉన్నట్లు భావిస్తోన్న… ఈ వేరియంట్ గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వెలుగుచూశాయి. తాజాగా వైరస్ జన్యుక్రమాన్ని గుర్తించే ల్యాబొరేటరీల ఇన్సాకాగ్… ఎక్స్‌ఈ వేరియంట్‌పై క్లారిటీ ఇచ్చింది. BA.2.10, BA.2.12.. BA.2 ఉప రకాలుగా గుర్తించినట్లు నిపుణులు తెలిపారు. BA.2 పాత సీక్వెన్సులే కొత్త వాటిగా వర్గీకరణ చేశారు. ఇవి వైరస్ తీవ్రతను పెంచుతాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. గత వారంతో పోల్చితే 12 రాష్ట్రాల్లో క్రమంగా వైరస్ ఉధృతి పెరుగుతోంది.
Read Also: Ukraine Russia War: అమ్మాయిలపైనే కాదు.. బాలురపై అత్యాచారాలు..!
Also Read
- Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
- Modi-Putin: పుతిన్‌కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
- Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
మరోవైపు, ఒమిక్రాన్ ఉపరకాలైన బీఏ.1, బీఏ.2ల కలయికగా అనుమానిస్తున్న ఎక్స్‌ఈ వేరియంట్.. తొలిసారి బ్రిటన్‌లో వెలుగుచూసింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకూ పాకింది. కొద్ది వారాల క్రితం ఈ వేరియంట్ కేసులు గుజరాత్, మహారాష్ట్రలో నమోదైనట్లు స్థానిక ప్రభుత్వాలు వెల్లడించాయి. కొత్త వేరియంట్ వ్యాప్తి, తీవ్రతపై స్పష్టత లేకపోయినా… ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ వేరియంట్‌కు అధిక సాంక్రమికశక్తి కలిగి ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇతర ఉత్పరివర్తనాల కంటే వ్యాపించే గుణం ఎక్స్‌ఈ వేరియంట్‌కు దాదాపు 10శాతం ఎక్కువ ఉన్నట్లు బ్రిటన్ పరిశోధకులు అంచనా వేశారు. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల ఉనికి కనిపిస్తున్నప్పటికీ.. కరోనా కొత్త కేసుల సంఖ్య మాత్రం అదుపులోనే ఉంది. వ్యాక్సినేషన్, కరోనా కారణంగా సహజంగా సంక్రమించిన రోగనిరోధకత.. వైరస్ కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Modi-Putin: పుతిన్‌కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
-
Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?