సెలూన్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్! కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో సెలూన్ షాప్ ఓపెనింగ్‌లో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ‘సెలూన్ కొనికి’ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పవన్‌తో పాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. సెలూన్ కొనికి…
నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దగ్గు జలుబుతో ఆసుపత్రికి చేరిన వారికి కరోనా టెస్టులు చేయడంతో ఒకేసారి 6 కేసులు బయటపడ్డాయి. కరుణ లక్షణాలు తక్కువగా ఉండడంతో ఐదుగురిని హోమ్ ఐసోలేషన్ పంపిన వైద్యులు.. మరో ఒకరికి నెల్లూరులోని కరోనా వార్డులో చికిత్స అందిస్తున్నారు.
దేశంలో కోవిడ్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి. నెమ్మదిగా మొదలైన కేసులు.. ఆ సంఖ్య ఐదు వేలకు చేరువలోకి వచ్చేసింది. ప్రస్తుతం దేశ వ్యా్ప్తంగా 4, 866 కేసులు ఉన్నట్లుగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో మరోసారి కరోనా మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. నిన్నామొన్నటి దాకా స్తబ్ధతగా ఉన్న కోవిడ్ తాజాగా మళ్లీ పడగ విప్పుతోంది. అనేక రాష్ట్రాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది.
ముంబైని కొట్టి.. క్వాలిఫయర్ అవకాశాన్ని అందుకున్న పంజాబ్! పదేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన పంజాబ్ కింగ్స్.. నేరుగా క్వాలిఫయర్ ఆడే అవకాశాన్నీ ఒడిసిపట్టింది. రెండో దశలో వరుస విజయాలతో దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన పంజాబ్.. 19 పాయింట్లతో పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టుకు ఫైనల్ చేరడానికి క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పంజాబ్‌కు ఫైనల్ చేరేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. పంజాబ్‌పై…
భారతదేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. మళ్లీ చాపకింద నీరులా పాకుతోంది. కోవిడ్ పూర్తిగా అంతరించిపోయిందన్న భావనలో ఉన్న ప్రజలకు మళ్లీ షాకిస్తోంది. కొత్త వేరియంట్రూపంలో ప్రజలకు దడ పుట్టిస్తోంది.
Covid-19: దేశంలో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరులో తొమ్మిది నెలల బాలుడికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. హోస్కోటేకి చెందిన శిశువును మొదట ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి, ఆ తర్వాత కలాసిపాల్యలోని వాణి విలాస్ ఆస్పత్రికి తరలించారు.
Covid-19: కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో భారతదేశంలో ఆయుర్దాయం గణనీయంగా తగ్గిందని జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ఓ అధ్యయనం ప్రచురించబడింది. అయితే, ఈ స్టడీని భారత ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది.
సింగపూర్‌లో విధ్వంసం సృష్టించిన కోవిడ్ KP.2 , KP.1 కొత్త వేరియంట్లు.. ఇప్పుడు భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ఇండియాలో 290 KP.2 కేసులు, 34 KP.1 కేసులు నమోదయ్యాయి. అయితే.. ఇవి JN1 సబ్ వేరియంట్లు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా.. కోవిడ్ కొత్త వేరియంట్లతో ఎలాంటి ప్రమాదం లేదని నివేదిక పేర్కొంది.
Saudi Arab : సౌదీ అరేబియాలో అంతు చిక్కని రోగం వేగంగా ప్రబలుతుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కి ఏప్రిల్ 10 - 17 మధ్య, దేశంలో ప్రమాదకరమైన వ్యాప్తి చెందుతున్న మిడిల్-ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) కరోనావైరస్ మూడు కేసులు కనుగొనబడ్డాయి.