ప్రస్తుతం ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే 11 దేశాల్లో 80 కేసులు గుర్తించగా… మరో 50 కేసులు పరిశీలనలో ఉన్నాయి. ఇటీవల మే మొదటివారంలో బ్రిటన్ లో ఓ వ్యక్తిలో వైరస్ కనుకున్నారు. నైజీరియా నుంచి బ్రిటన్ కు వచ్చిన వ్యక్తిలో వైరస్ ను కనుక్కున్నారు. తాజాగా మే 18న యూఎస్ఏలో కూడా ఒక కేసు బయటపడింది. దీంతో ప్రపంచ ఆరోగ్య కేంద్రం ( డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఇప్పటికే యూకే, యూఏస్ఏ, పోర్చుగల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, బెల్జియం, స్వీడన్, స్పెయిన్, ఆస్ట్రేలియా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ కేసులు బయటపడ్డాయి.
ఇదిలా ఉంటే మంకీపాక్స్ పై భారత ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. ముఖ్యంగా ప్రభావిత దేశాల నుంచి వచ్చే అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల నమూనాలను తీసుకుని పూణేలోని నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి తరలించాలని ఆదేశించింది కేంద్రవైద్యారోగ్య శాఖ. ఇదే విధంగా ఎన్సీడీఏ, ఐసీఎంఆర్ పరిస్థితిని నిశితంగా గమనించాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే కేరళ ప్రభుత్వం కూడా మంకీపాక్స్ పై అలెర్ట్ అయింది. వ్యాధిపై కేరళలోని అన్ని ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఇతర దేశాల్లో వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారుల అప్రమత్తంగా ఉండాలని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఆదేశించింది.
ఇదిలా ఉంటే గతంలో ఇండియాలో బయటపడిన వైరస్ లో దాదాపు అన్నీ కూడా ముందుగా కేరళలోనే బయటపడ్డాయి. కరోనా సమయంలో కేరళలోనే తొలికేసు నమోదు అయింది. దీంతో అంతకుముందు నిఫా వైరస్ కూడా కేరళను వణికించింది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. నిఫా కారణంగా కేరళలో లాక్ డౌన్ విధించి నిఫా వైరస్ ను కట్టడి చేశారు.