కరోనా సమయంలో ఫేస్ మాస్క్ లు తప్పనిసరి అయ్యింది. మాములుగా మెడికేటెడ్ మాస్క్ లతో పాటుగా గుడ్డతో తయారు చేసిన వివిధ రకాల మాస్కులు వినియోగదారులకు అందుబాటులో ఉంటున్నాయి. రకరకాల డిజైన్స్ తో కూడిన మాస్క్ లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. అయితే, ఇంగ్లాండ్ లోని స్వింటన్ నుంచి మాంచెస్టర్ కు వెళ్తున్న బస్సులో ఓ ప్రయాణికుడు వెరైటీ మాస్క్ ధరించి బస్సు లో ప్రయాణం చేస్తున్నాడు. పాము చర్మంతో తయారు చేసిన మాస్క్ లా ఉండటంతో వెరైటీ గా ఉందని అనుకున్నారు. కాసేపటి తరువాత…
ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి కోలుకునేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సందర్శక ప్రాంతాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు హోటల్స్ బుకింగ్‌లో డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ‘టూరిస్ట్ ఇన్సెంటివ్ కూపన్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా పర్యాటకుల హోటల్స్ బుకింగ్‌లో రూ.1000 లేదా 25శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. ఈ డిస్కౌంట్ కూపన్ పొందాలంటే ఉత్తరాఖండ్ పర్యాటకశాఖ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కనీసం మూడు రోజులు ఉండేలా బుకింగ్…
దేశవ్యాప్తంగా తగ్గినట్టే తగ్గిన కరోనా వైరస్ కొత్త పాజిటివ్ కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతోంది.. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ కేసులు ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.. మరోవైపు మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. దీంతో.. పొరుగు రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి.. ముఖ్యంగా మహారాష్ట్రలో సెకండ్ వేవ్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్రం నుంచి తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్…