దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు ప్రజనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. త్వరలో కరోనా ఫోర్త్ వేవ్ రాబోతుందా అనే భయాలు వెంటాడుతున్నాయి. గతం కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలం నుంచి దేశంలో రోజూ వారీ కేసుల సంఖ్య కేవలం 3 వేల లోపే ఉంటోంది. అయితే గత వారం నుంచి మాత్రం అనూహ్యంగా కేసులు 6 వేలు, 7 వేలకు చేరుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఎక్కువ గా కేసులు…
రెండు వేవ్ లు సృష్టించిన విధ్వంసం ప్రపంచం ఇంకా మర్చిపోలేదు..ఒమిక్రాన్ చడీ చప్పుడు లేకుండా దాటిపోయినా, ఇంకా కరోనా భయం పోలేదు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మళ్లీ వైరస్ వ్యాప్తి పెరిగింది. దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. లేటెస్ట్‌గా కొత్త కేసులు 8 వేలకు పైగా రిపోర్ట్ అయ్యాయి. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేలను దాటేసింది. శుక్రవారం దాదాపు మూడున్నర లక్షలమందికి టెస్టులు చేస్తే, అందులో 8,329 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.…
భారత్‌లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పంజా విసురుతున్నాయి.. వందలకు పరిమితమైన కేసులు.. ఇప్పుడు వేలను దాటేస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 8,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,30,101కు చేరింది.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 4,26,57,335 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోగా.. మహమ్మారి బారినపడి ఇప్పటికే 5,24,771 మంది ప్రాణాలు వదిలారు.. యాక్టివ్…
ఓ వైపు కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం మళ్లీ తల్లిదండ్రుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. ఈ ఏడాది కూడా తమ పిల్లల చదువులు అంతంత మాత్రంగానే సాగుతాయా.? అనే భయాందోళల్లో తల్లిదండ్రులు ఉన్నారు. రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతాయా.? లేదా.? అనే సందేహాలు తలెత్తాయి. అయితే జూన్ 13 నుంచి యాథాతథంగా స్కూళ్లు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. సెలవులను పొడగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపటి నుంచి…
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కాంగ్రెస్ అధినేత్రికి ఇటీవల సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే ఈ లోపే ఆమె కరోనా బారిన పడ్డారు. నిజానికి ఈనెల 8 సోనియా గాంధీ ఈడీ ముందు హాజరుకావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆమెను జూన్ 23న విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ తాజా నోటిసులు జారీ చేశారు. ఈ కేసులో కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని కూడా ఈడీ…
దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. శుక్రవారం 3,44,994 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. 8,329 మంది వైరస్ బారిన పడ్డారు. 10 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం కొవిడ్ నుంచి 4,216 మంది కోలుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, దిల్లీ, కర్ణాటక, హర్యానాలో మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో క్రియాశీల కేసులు 40 వేల మార్కును దాటేశాయి. దేశంలో రికవరీ రేటు 98.69 శాతానికి పడిపోయింది. పాజిటివిటీ రేటు వరుసగా మూడోరోజు రెండు శాతం(2.41…
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఫోర్త్ వేవ్ కు దారి తీస్తాయా.? అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల మూడు నాలుగు రోజుల నుంచి వరసగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలంలో గరిష్ట రోజూవారీ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం దేశంలో 3000కు లోపలే కరోనా కేసులు ఉంటే.. ప్రస్తుతం మాత్రం కేసుల సంఖ్య 7 వేలను దాటింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలు…
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడ్డారు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో అతడికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో నాటింగ్‌హమ్ వేదికగా జరగనున్న టెస్ట్ మ్యాచ్‌కు కేన్ దూరం కానున్నాడు. కరోనా బారిన పడటంతో కేన్ ఐదు రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. దీంతో అతడికి రీప్లేస్‌మెంట్‌గా హమిష్ రూథర్‌ఫర్డ్‌ను జట్టులోకి తీసుకున్నారు. Markram: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్‌క్రమ్‌కు కొవిడ్ కేన్‌కు కొవిడ్ సోకడంతో మూడు టెస్టుల సిరీస్‌లో…
దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్ కరోనా బారిన పడ్డారు. జట్టు సభ్యులకు కొవిడ్-19 టెస్ట్‌లు జరపగా.. అతనికి పాజిటివ్ అని తేలింది. దీంతో గురువారం భారత్‌తో జరుగుతున్న సిరీస్ తొలి టీ20 మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో సన్ రైజర్స్ తరఫున ఐడెన్ మార్క్రమ్ ఆడిన సంగతి తెలిసిందే. మార్క్రమ్ జూన్ 2న ఇండియాకు వచ్చాడు. టీమ్‌కు రెగ్యులర్‌గా కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. అతనికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. మిగతవారందరికీ నెగెటివ్…