ఇండియాలో కరోనా కేసులు తక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇటీవల కొన్ని రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోజూ వారీ కేసుల సంఖ్య కూడా మూడు వేలకు లోపే నమోదు అవుతున్నాయి. అయితే ఇటీవల మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. చైనా, హాంకాంగ్, నార్త్ కొరియా, సౌత్ కొరియా వంటి దేశాల్లో ఇటీవల కరోనా కేసులు పెరిగినా… ఇండియాలో మాత్రం గత ఫిబ్రవరి నుంచి కేసుల తీవ్రత ఎక్కువగా లేదు.
ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 2,226 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ప్రస్తుతం 14,955 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. గడిచిన 24 గంటల్లో 65 మంది మరణించారు. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,25,97,003గా ఉంది. 24 గంటల్లో 2202 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. కరోనా బారినపడి దేశంలో ఇప్పటి వరకు 5,24,413 మంది మరణించారు. డెత్ రేటు 1.22గా ఉంది.
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో అర్హులైన వారికి 192,28,66,524 డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,37,381 డోసులను ఇచ్చారు.