ఇప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో క్రేజ్ సంపాదించుకున్న అమెజాన్ ప్రైమ్ కొత్తగా క్రీడాభిమానులకు గాలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో తొలిసారిగా క్రికెట్ లైవ్ ప్రారంభమైంది. శనివారం నాడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆట అమెజాన్ ప్రైమ్‌లో లైవ్ స్ట్రీమ్ అయ్యింది. దీంతో క్రికెట్ అభిమానులు టీవీ ఛానళ్ల జోలికి వెళ్లకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా క్రికెట్‌ను వీక్షిస్తున్నారు. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ…
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారికి కేంద్ర ప్రభుత్వం చేదువార్తను అందించింది. డిసెంబర్ 31తో ముగుస్తున్న ఐటీఆర్ దాఖలు గడువును పెంచేందుకు కేంద్రం నిరాకరించింది. ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును ఎట్టి పరిస్థితుల్లో పొడిగించే అవకాశం లేదని కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 5.62 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు. Read Also: ఏడాదిలో చివరి రోజు… స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు…
ఈ ఏడాదిని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగించాయి. ఈరోజు ఉదయమే లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు లాభాలతోనే ముగించడం విశేషం. సెన్సెక్స్ 459.5 పాయింట్ల లాభంతో 58,253 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 17,354 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో టైటాన్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, కొటక్ మహింద్రా బ్యాంక్, మారుతి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థల షేర్లు లాభపడ్డాయి. ఎన్టీపీసీ, టెక్ మహింద్రా, పవర్ గ్రిడ్, డాక్టర్…
దేశంలోని బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. డిసెంబర్ 31తో ముగియనున్న కేవైసీ అప్డేట్ గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. కెవైసీ ప్రక్రియలో భాగంగా ఖాతాదారులు బ్యాంకులకు తమ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. Read Also: కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న బంగారం ధర మనీ…
కరోనా కారణంగా గత ఏడాది చుక్కలు చూపించిన బంగారం ధరలు మరోసారి భారీగా పెరగనున్నాయి. తాజాగా ఒమిక్రాన్ ఎఫెక్ట్, ద్రవ్యోల్బణం కారణంగా వచ్చే ఏడాది మరోసారి 10 గ్రాముల బంగారం ధర రూ.55వేలకు చేరుతుందని మార్కెట్ పండితులు అంచనా వేస్తున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా బంగారం దిగుమతి తగ్గిపోవడంతో డిమాండ్ దృష్ట్యా 2020లో 10 గ్రాముల బంగారం రూ.56,200 పలికింది. నాటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం ధర 10 శాతం తగ్గింది. Read Also: బీమా కంపెనీల…
పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ సెలబ్రేషన్ లాంటిది. అయితే కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల పెళ్లిళ్లు వాయిదా పడటమో లేదా రద్దు కావడమో జరగుతుంటాయి. గత రెండేళ్ల కాలంలో కరోనా కారణంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదాలు పడ్డాయి. మరికొన్ని రద్దయ్యాయి. ఇప్పుడు ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా వివాహాలు రద్దయితే అటు ఆడపెళ్లి వారికి, ఇటు మగపెళ్లి వారికి చాలా ఆర్థిక నష్టం చేకూరుతుంది. అయితే ఇకపై ఆర్థికంగా నష్టపోకుండా పెళ్లిళ్లపైనా…
ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను ఆకట్టుకునేలా అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రూ.599 ప్లాన్‌తో ప్రతిరోజూ 5జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. అంతేకాకుండా రోజూ 100 ఎస్ఎంఎస్లు కూడా చేసుకోవచ్చని సూచించింది. డైలీ డేటా లిమిట్ ముగిసిన అనంతరం 40 KBPS డేటా వాడుకోవచ్చని పేర్కొంది. అటు అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ లిమిటెడ్ ఫ్రీ డేటాను వాడుకోవచ్చని… ఈ ప్లాన్ వ్యాలిడిటీ…
ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు ఒక నెలలో 30 లేదా 31 రోజులు ఉంటే 28 రోజుల లెక్కన రీఛార్జ్ ప్లాన్లను మాత్రమే ప్రకటిస్తున్నాయి. ఈ లెక్కన ఏడాదికి 336 రోజులే అవుతుంది. సాధారణ సంవత్సరంతో పోలిస్తే 29 రోజులు తక్కువ అన్నమాట. అయితే టెలికాం కంపెనీల ప్లాన్ వెనుక ఓ లాజిక్ ఉంది. అంతేకాదు… రూ.వేల కోట్ల వ్యాపారం కూడా దాగి ఉంది. Read Also: రివైండ్ 2021: సెంచరీ కొట్టిన పెట్రోల్.. జనవరిలో అలా……
2021 ఏడాది మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ తర్వాత ప్రజలు ఎక్కువ చర్చించుకున్నది… ఇబ్బంది పడింది పెట్రోల్ ధరల విషయంలోనే. ఎందుకంటే దేశంలో ఈ ఏడాది లీటర్ పెట్రోల్ ధర తొలిసారిగా రూ.100 దాటింది. ప్రస్తుతం దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇది రూ.100పైనే ఉంది. అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలకు దేశీయ సుంకాలు తోడవడంతో సామాన్యుడు పెట్రోల్ ధరల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర…
దేశంలో సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. శుద్ధి చేసిన పామాయిల్‌పై విధించే ప్రాథమిక కస్టమ్స్ దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.3 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సీబీసీఐసీ తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. దీంతో పామాయిల్ ధరలు తగ్గనున్నాయి. ట్రేడర్లు లైసెన్స్ లేకుండానే పామాయిల్ దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో ఆర్బీడీ పామ్ ఆయిల్, ఆర్బీడీ పామోలిన్ వంటి వాటిని లైనెన్స్ లేకుండానే దిగుమతి చేసుకోవచ్చని తెలిపింది. Read…