దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. సుంకాలను 90 రోజులు ట్రంప్ వాయిదా వేశారు. ఈ నిర్ణయం ఇన్వెస్టర్లలో నూతనోత్సహాన్ని నింపింది. దీంతో అమెరికా మార్కెట్‌తో పాటు ఆసియా మార్కెట్లు భారీ లాభాలు అర్జిస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్ మాత్రం కళకళలాడుతోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 6 శాతానికి తగ్గినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
Smartphone: భారత్ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి, ఎగుమతుల్లో దూసుకుపోతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఏకంగా రూ. 2 లక్షల కోట్ల స్మార్ట్ఫోన్లు ఎగుమతి అయ్యాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం తెలిపారు. ఈ ఎగుమతుల్లో దాదాపుగా రూ. 1.5 లక్షల కోట్ల విలువైన ‘‘ఐఫోన్’’ షిప్మెంట్లు ఉన్నాయని వెల్లడించారు. 2023-24 �
దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం సరికొత్త కళ సంతరించుకుంది. ట్రంప్ సుంకాలతో సోమవారం ఇన్వెస్టర్లకు బ్లాక్ మండేగా మారింది. కానీ కొన్ని గంటల్లోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సుంకాలు కారణంగా ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోయాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. కోవిడ్ సమయంలో ఎదురైన భారీ పతనం.. మరోసారి ట్రంప్ టారిఫ్‌లు కారణంగా చవిచూశాయి. ఇక ట్రంప్‌నకు ధీటుగా చైనా కూడా సుంకాలు పెంచేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు కారణంగా ప్రపంచ మార్కెట్ కుదేలైపోయింది. అమెరికా మార్కెట్‌తో పాటు అన్ని మార్కెట్లు కకావికలం అయ్యాయి. ఇక ఆసియా మార్కెట్ అయితే అల్లకల్లోలం అయింది. ఇదే అంశంపై ఆదివారం ట్రంప్‌ను విలేకర్లు ప్రశ్నంచగా చాలా తేలిగ్గా తీసుకున్నారు.
ట్రంప్ వాణిజ్య యుద్ధం కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం అల్లకల్లోలం అయిపోయింది. ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే భారీ నష్టాలతో ప్రారంభమైంది. సూచీలన్నీ భారీగా పతనం అయిపోయాయి.
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. గత కొద్దిరోజులుగా హడలెత్తించిన బంగారం ధరలు.. గత వారం నుంచి వరుసగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం కూడా మరోసారి భారీగా ధరలు తగ్గాయి. ధరలు దిగి రావడంతో కొనుగోలుదారులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.