ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (IIT-K), క్రిప్టోకరెన్సీ లావాదేవీల ద్వారా మోసానికి సంబంధించిన కేసులను గుర్తించడంలో మరియు ఛేదించడంలో ఉత్తరప్రదేశ్ పోలీసులకు సహాయపడేందుకు దేశీయంగా రూపొందించిన సాధనాన్ని అందజేస్తుంది. ఐఐటీ కాన్పూర్ నుండి ప్రొఫెసర్ సందీప్ శుక్లా మాట్లాడుతూ.. హోప్ (HOP) అని పిలువబడే ఐఐటీ అభివృద్ధి చేసిన సాధనం క్రిప్టోకరెన్సీ లావాదేవీలను విశ్లేషించగలదన్నారు.
ఈ సాధనం మిగితా విదేశీ పరికరాల కంటే చౌకైనదని ఆయన వెల్లడించారు. సెప్టెంబరు నాటికి, మా టూల్ యూపీ పోలీసులకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటుంది మరియు క్రిప్టోకరెన్సీ మోసం కేసుల దర్యాప్తులో సహాయం చేస్తుందని శుక్లా వివరించారు. ఏడీజీ, సైబర్ క్రైమ్, సుభాష్ చంద్ర, సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాలు మరియు విపత్తును ఎదుర్కోవడానికి పోలీసు శాఖల సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
“మేము 37,000 ఖాతాలు, బ్యాంకులు మరియు కార్డులపై చర్యలు తీసుకున్నాము మరియు ఒక సంవత్సరంలో 9.5 కోట్ల రూపాయలను రికవరీ చేసాము” అని చంద్ర వెల్లడించారు. సైబర్ క్రైమ్ ఎస్పీ త్రివేణి సింగ్ మాట్లాడుతూ.. పోలీసు శాఖలకు సైబర్ భద్రత అవగాహన మరియు సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇది మొదటి కార్యక్రమమని ఆమె అన్నారు. దోపిడీ కేసుల్లో కీలకంగా మారిన వీవోఐపీ ఆధారిత కాల్‌ల విచారణకు ప్రాథమిక నైపుణ్యాలు మరియు పద్ధతులు అవసరమని ఆమె అన్నారు.