మన దేశంలో బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా బంగారం కొంటుంటారు. కొందరు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే కరోనా వచ్చినప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటీవల కొంచెం తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. కరోనా థర్డ్ వేవ్ కారణంగా మరోసారి బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. Read Also: శుభవార్త.. భారీగా…
రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కామర్స్ సంస్థలే కాదు విమానయాన సంస్థలు కూడా ప్రత్యేకంగా పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ప్రైవేట్ విమానయాన కంపెనీ ‘గో ఫస్ట్’ మరింత మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు రిపబ్లిక్ డే సందర్భంగా విమాన టిక్కెట్లను అత్యంత చౌకగా అందుబాటులోకి తెచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా ‘రైట్ టూ ఫ్లై’ పేరుతో రూ.926కే విమాన ప్రయాణం చేసేలా అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. Read Also: రిపబ్లిక్ డే సందర్భంగా ‘హ్యాపీ’ ఆఫర్లు ఈ…
తెలుగు రాష్ట్రాలలో మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారికి ‘హ్యాపీ మొబైల్స్’ సంస్థ శుభవార్త అందించింది. రిపబ్లిక్ డే సందర్భంగా మూడు రోజుల పాటు ఫ్లాష్ సేల్ నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా షావోమీ భాగస్వామ్యంతో షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ను విడుదల చేసినట్లు హ్యాపీ సంస్థ తెలిపింది. ప్రో గ్రేడ్ 108 మెగాపిక్సల్ కెమెరా, అత్యద్భుతమైన 6.67 అంగుళాల ఎఫ్హెచ్డీ + 120 హెర్జ్ అమోలెడ్ డిస్ప్లే, సౌండ్ బై హర్మాన్ కార్డన్తో డ్యూయల్ స్పీకర్లు ఈ…
ఒక్క సిలిండర్తో అష్టకష్టాలు పడుతున్న ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఒక్క గ్యాస్ సిలిండర్ కలిగి ఉన్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తత్కాల్ సేవ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ఇండేన్ గ్యాస్ సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా గ్యాస్ బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే వినియోగదారులు సిలిండర్ పొందవచ్చని కంపెనీ జనరల్ మేనేజర్ వి.వెట్రీ సెల్వకుమార్ వెల్లడించారు. అయితే తత్కాల్ సేవ సౌకర్యం వినియోగించుకున్న కస్టమర్లు అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. Read Also: రిపబ్లిక్…
భారత్లో బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత రెండేళ్లలో బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరిగి 102 నుంచి 142కి పెరిగింది. ఈ వివరాలను తాజాగా ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసింది. 2021 నాటికి భారత్లో 142 మంది బిలియనీర్లు ఉండగా… వీరి దగ్గర ఉన్న ఉమ్మడి సంపద విలువ 719 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంటే భారత కరెన్సీలో 53 లక్షల కోట్లు అన్నమాట. దేశంలోని 55.5 కోట్ల ప్రజల వద్ద ఎంత సంపద…
ప్రముఖ కంపెనీ హిందూస్థాన్ యూనీలివర్ (HUL) సామాన్యులకు మరోసారి షాకిచ్చింది. గత ఏడాది నవంబరులోనే పలు ఉత్పత్తుల ధరలను పెంచిన హెచ్యూఎల్ తాజాగా మరోసారి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాము ఉత్పత్తి చేస్తున్న సబ్బులు, డిటర్జెంట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్బాయ్ సబ్బుల ధరలను 3 నుంచి 20 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. తాజా ధరల ప్రకారం బట్టలు ఉతికేందుకు…
ఇప్పటికే నిత్యావసరల ధరలు, కూరగాయల ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఏపీ, తెలంగాణలో సిమెంట్ బస్తాల ధరలు పెరిగాయి. 50 కిలోల బస్తాపై ధరను రూ.20-30 మేర పెంచుతున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో ధర పెంచినట్లు చెప్పారు. ధరల పెంపుతో సిమెంట్ బస్తా ధర రూ.300-350 మధ్యలో ఉంటుందని తెలిపారు. Read Also: కరోనాకు టాబ్లెట్ వచ్చేసింది… ధర ఎంతో తెలుసా? గత…
దక్షిణాఫ్రికా కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలో అంతకంతకూ పెరుగుతున్న వేళ బీమా నియంత్రణ, అధివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ గుడ్న్యూస్ చెప్పింది. కరోనా ఆరోగ్య బీమా పాలసీల్లో ఒమిక్రాన్ చికిత్సకు చేసిన ఖర్చులు కూడా కవరేజీ అవుతాయని ప్రకటించింది. సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు జారీ చేసిన అన్నిరకాల ఆరోగ్య బీమా పాలసీల్లో కరోనా చికిత్సకు పరిహారం ఇవ్వాలని ఐఆర్డీఏఐ గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో తన ఆదేశాలను…
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి డిసెంబరు మాసంలో అమ్మకాల జోరును చూపించలేకపోయింది. అమ్మకాల పరంగాచూస్తే, 2021 డిసెంబరులో మారుతి సుజుకి కార్ల అమ్మకాల్లో 4 శాతం క్షీణత కనిపించింది. కిందటి నెలలో మారుతి 1,53,149 వాహనాలు విక్రయించింది. 2020 డిసెంబరులో మారుతి సంస్థ 1,60,226 కార్లు విక్రయించింది. 2021 నవంబరులో 1,39,184 కార్లు విక్రయించినట్టు తాజా ప్రకటనలో మారుతి సంస్థ వెల్లడించింది. Read Also:సర్కార్ను మేల్కొల్పడమే జాగరణ లక్ష్యం: బండిసంజయ్ డిసెంబరులో అమ్మకాలు కాస్త…
దేశంలో జీఎస్టీ వసూళ్లు వరుసగా ఆరో నెల కూడా లక్ష కోట్లు దాటాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో రూ.1,29,780 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా (సీజీఎస్టీ) రూ.22,578 కోట్లు కాగా… రాష్ట్రాల వాటా (ఎస్జీఎస్టీ) రూ.28,658 కోట్లు, అంతర్జాతీయ వాటా (ఐజీఎస్టీ) రూ.69,155 కోట్లుగా నమోదయ్యాయి. ఐజీఎస్టీలో దిగుమతిపై వచ్చిన రూ.37,527 కోట్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సెస్ రూపంలో రూ.9,389 కోట్లు వసూలయ్యాయి. Read…