Akasa Air: వచ్చే నెలలో ‘ఆకాశ’ విమానం టేకాఫ్.. ఫస్ట్ లుక్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రజలకు తక్కువ ఖర్చుకే విమాన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ‘ఆకాశ’ విమానయాన సంస్థను ఝున్‌ఝున్ వాలా ప్రకటించారు. విమానయాన రంగంలో రూ.262 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొన్నారు. కాగా వచ్చే నెలలో ఆకాశ విమానాలు టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఆకాశ విమానాలకు సంబంధించిన ఫోటోలను కంపెనీ షేర్ చేసింది.
ఆకాశ ఎయిర్‌లైన్స్ సంస్థ జూన్‌లో ముంబైలో తన మొదటి విమానాన్ని డెలివరీ తీసుకోనుంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కు అమెరికాలోని బోయింగ్ పోర్ట్‌ల్యాండ్ ఫెసిలిటీలో తుది మెరుగులు దిద్దుతున్నట్లు సంస్థ తెలిపింది. మరోవైపు ఆకాశ ఎయిర్‌లైన్స్ సంస్థ తమ లోగోను గత ఏడాదే లాంచ్ చేసింది. తన లోగో కోసం సన్‌రైజ్ ఆరెంజ్‌తో పాటు పాషనేట్ పర్పుల్ రంగులను ఎంచుకుంది. మార్చి 2023 నాటికి 18 విమానాలను నడపాలని ఆకాశ ఎయిర్‌లైన్స్ సంస్థ యోచిస్తోంది. మెట్రో నగరాల నుంచి టైర్-2, టైర్-3 నగరాల మధ్యే ఈ విమాన సేవలు ఆరంభం అవుతున్నాయి. కాగా ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు గతేడాదే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. కమర్షియల్ విమానాలు కూడా నడిపించుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అత్యాధునిక, బ్రాండ్ న్యూ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో ఆకాశ ఎయిర్ లైన్స్ సంస్థ మార్కెట్లోకి వస్తోంది.
Also Read
Can’t keep calm! Say hi to our QP-pie! 😍#AvGeek pic.twitter.com/sT8YkxcDCV
— Akasa Air (@AkasaAir) May 23, 2022
తాజావార్తలు
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
-
Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!