టెస్లా అధినేత ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల జాబితాలో ఆయన ఒకరు. ఈ మేరకు ఆయన ఏడాదికి ఎంత పన్ను కడతారో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాను ఈ ఏడాది 11 బిలియన్ డాలర్లను పన్నుగా చెల్లించనున్నట్లు ఎలన్ మస్క్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారత కరెన్సీలో ఆయన కట్టే పన్ను విలువ రూ.85వేల కోట్లు అన్నమాట. దీంతో అమెరికా…
ప్రముఖ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్-350 మోడల్ బైకుల్లో సాంకేతిక లోపం ఉన్నందున వాటిని రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్ బైక్ వెనుక భాగంలోని బ్రేకుల్లో సమస్య ఉన్నట్లు కంపెనీ సాంకేతిక విభాగం గుర్తించిందని.. అందుకే 26,300 బైకులను వెనక్కి పిలిపిస్తున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ వెల్లడించింది. క్లాసిక్-250 మోడల్ బైకుల్లో బ్రేక్ పెడల్‌ను గట్టిగా నొక్కితే రెస్పాన్స్ బ్రాకెట్‌పై ప్రతికూల…
భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ ఖాతాదారులకు 3 ఇన్ 1 ఖాతా పేరుతో సరికొత్త సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. దీంతో సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలను అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఖాతా వల్ల ట్రేడింగ్ చేసే వారికి ప్రయోజనం చేకూరుతుందని ఎస్బీఐ పేర్కొంది. 3 ఇన్ 1 ఖాతాతో వినియోగదారులు మూడు రకాల సదుపాయాలను పొందుతారని సూచించింది.…
కరోనా పుణ్యమా అని ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. సినిమా థియేటర్లు తెరిచినా ఓటీటీలు ఉన్నాయి కదా అని చాలా మంది వెళ్లడం లేదు. దీంతో పలు ఓటీటీ సంస్థలు ఛార్జీలు పెంచే పనిలో పడ్డాయి. తాజాగా అమెజాన్ సంస్థ ప్రైమ్ మెంబర్షిప్ ఛార్జీలు భారీగా పెంచింది. ఈరోజు అర్ధరాత్రి నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఓటీటీ ప్రియులకు ఓ వైపు అమెజాన్ షాక్ ఇవ్వగా.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా మాత్రం గుడ్‌న్యూస్ చెప్పింది. Read Also: గుడ్‌న్యూస్ చెప్పిన…
అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఈరోజే తీసుకోండి. లేకపోతే రేపటి నుంచి రూ.500 ధర ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కోసం ఏడాదికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మెంబర్షిప్ ద్వారా అమెజాన్‌లో ఏవైనా వస్తువులు తీసుకుంటే.. ఫాస్ట్ డెలివరీతో పాటు ప్రైమ్ మూవీస్, ప్రైమ్ మ్యూజిక్‌ను యాక్సెస్ చేయవచ్చు. కానీ డిసెంబర్ 14 నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ ధర పెరగనుంది. Read Also: ఫేస్బుక్ నుంచి…
ఫేస్బుక్ మరో సరికొత్త అప్డేట్ను తీసుకువచ్చింది. ఫేస్బుక్ ఖాతాలను యాక్సెస్ చేయలేని వారు, బ్లాక్ అయిన ఖాతాలను తిరిగి యూజర్లు పొందేందుకు.. లైవ్ చాట్ సపోర్ట్ ఫీచర్‌ను ఫేస్బుక్ యాడ్ చేసింది. ఈ ఫీచర్.. యూజర్లు తమ ఖాతాలను తిరిగి పొందేందుకు తోడ్పడనుంది. అయితే, లైవ్ చాట్ సపోర్ట్ కేవలం ఇంగ్లీష్‌లోనే అందుబాటులో ఉంది. ఫేస్బుక్ సపోర్ట్‌పై క్లిక్ చేస్తే కస్టమర్ ఎగ్జిక్యూటివ్‌తో యూజర్లు చాట్ చేసే అవకాశం కల్పిస్తోంది. Read Also: జనవరి 1 నుంచి…
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు శనివారం అర్ధరాత్రి కొద్ది గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. ఈ సమయంలో ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలతో పాటు యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు సైతం నిలిచిపోతాయని ఎస్బీఐ తెలిపింది. శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం వేకువ జామున 4:30 వరకు ఈ సేవలు నిలిచిపోనున్నట్లు ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. Read…
జీవితంలో సొంతిల్లు కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అయితే సొంతిల్లు కొనుగోలు చేసేవారు ఇప్పుడే త్వరపడండి. లేకపోతే మీరు ఇల్లు కొనుగోలు చేయడం కష్టతరం కావచ్చు. ఎందుకంటే వచ్చే ఏడాది ఇళ్ల ధరలు పెరగనున్నట్లు ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెంట్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. కరోనా పరిణామాల వల్ల గత రెండేళ్లుగా నివాస గృహాల ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా.. వచ్చే ఏడాది మాత్రం 5 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు 2022 అవుట్ లుక్…
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్సైట్ ర్యాంకింగ్ సర్వీస్ అలెక్సా.కామ్‌ను షట్‌డౌన్ చేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. వచ్చే ఏడాది మే నెల నుంచి దీనిని అమలు చేయనున్నట్లు తెలిపింది. అలెక్సా.కామ్ ద్వారా వెబ్సైట్ల స్టాటిస్టిక్స్, వాటి ర్యాంకులను అమెజాన్ అందిస్తోంది. అంతేకాకుండా ఎస్ఈవో రీసెర్చ్, అనాలిసిస్ టూల్స్ కూడా అందిస్తోంది. పెయిడ్ వెర్షన్ తీసుకుంటే పలు రకాల ఎస్ఈవో సర్వీసులను కూడా వినియోగదారులు పొందవచ్చు. Read Also: బాలినో భళా… మూడేళ్ల కాలంలో……
కొత్త సంవత్సరం నుంచి బ్యాంక్ ఖాతాదారులకు షాక్ తగలనుంది. 2022, జనవరి 1 నుంచి ఏటీఎం సెంటర్లలో అపరిమిత లావాదేవీలు జరిపితే ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు అపరిమిత లావాదేవీలపై రుసుములు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రతి నెలా ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి దాటితే.. ఎక్కువ రుసుములు వసూలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు కస్టమర్ల నుంచి ఫైన్ వసూలు చేసేందుకు దేశంలోని అనేక బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి…