గత కొన్నిరోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్ ధరలు త్వరలో భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్ రేట్లు మరోసారి భారీగా పెరుగుతాయని డెలాయిట్ ఇండియా ఎల్ఎల్పీ అంచనా వేసింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నా.. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చమురు కంపెనీలు ధరలు…
సామాన్యులకు సొంతింటి కల మరింత ప్రియం కానుంది. తాజాగా ఏపీ, తెలంగాణలో మరోసారి సిమెంట్ ధరలు పెరిగాయి. ఈనెల 1 నుంచి సిమెంట్ బస్తాపై రూ. 20 నుంచి రూ. 50 వరకు ధర పెంచినట్లు సిమెంట్ కంపెనీలు వెల్లడించాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50 కిలోల బస్తా ధర బ్రాండ్ ఆధారంగా రూ.310 నుంచి రూ.400 వరకు పలుకుతోంది. సిమెంట్ ధరలు భారీగా పెరుగుతున్న కారణంగా ఇల్లు కట్టుకోవాలంటే పలువురు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.…
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్లో వాట్సాప్ కీలక మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా టైమ్ లిమిట్ను మరింత పెంచనుంది. దీంతో తాము పంపిన మెసేజ్లను 60 గంటలు (రెండున్నర రోజులు) తర్వాత కూడా ఇద్దరికీ కనిపించకుండా యూజర్లు డిలీట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ పనితీరును పరిశీలిస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. Read Also: ఫేక్ న్యూస్..…
పొదుపు ఖాతాదారులకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) బ్యాడ్ న్యూస్ అందించింది. ఖాతాదారులు పొదుపు ఖాతాల్లో చేసే జమపై వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న వడ్డీ రేట్లపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ప్రకటించింది. రూ.1 లక్ష వరకు చేసే డిపాజిట్పై 2.25% వడ్డీరేటు, రూ.1 లక్ష-రూ.2 లక్షల వరకు జమ చేసే డిపాజిట్లపై 2.50% వడ్డీ మాత్రమే లభిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఈనెల 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు పోస్టాఫీస్…
కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో డిజిటల్ కరెన్సీ గురించి ప్రధానంగా ప్రస్తావించింది. త్వరలోనే డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటన చేశారు. డిజిటల్ కరెన్సీని సీబీడీసీగా పిలుస్తారు. సీబీడీసీ అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇది పూర్తిగా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. డిజిటల్ కరెన్సీ రాకతో ఇప్పటివరకు నగదు వినియోగంపై ఆధారపడిన ప్రస్తుత వ్యవస్థ విప్లవాత్మక మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది. వినియోగదారులు పేమెంట్లు చేయడానికి…
కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు బడ్జెట్-2022ను ఆవిష్కరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రకారం కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే కొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. కొన్నింటిపై కస్టమ్ సుంకం తగ్గించగా.. కొన్నింటిపై కస్టమ్ సుంకం పెంచారు. అందువల్ల ధరల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ధరలు తగ్గే వస్తువుల జాబితా: మొబైల్ ఫోన్లు, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ట్రాన్స్ఫార్మర్లు, వజ్రాలు,…
రెండేళ్లుగా పెరుగుతున్న వంటనూనెల ధరలు ఇటీవల స్వల్పంగా తగ్గి పేదలకు ఊరట కలిగించాయి. అయితే ప్రస్తుతం దేశంలో నూనె పంటలు తగ్గడంతో వంట నూనెలకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి మళ్లీ షాక్ తగలనుంది. మరోసారి వంట నూనెల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇండోనేషియా. భారత్కు ఎక్కువగా వంటనూనెలు ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతున్నాయి. భవిష్యత్లో ఎగుమతులు తగ్గించుకోవాలని ఇండోనేషియా భావిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా ఇండియాకు వంట…
మన దేశంలో బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా మహిళలు బంగారం కొంటుంటారు. బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు అత్యంత ఆసక్తిని చూపిస్తారు. కరోనా ప్రారంభమైన నాటి నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల పసిడి ధర మరోసారి రూ.50వేలు కూడా దాటింది. అయితే కొన్నిరోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. Read Also: కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డు.. ఏడాదిలో కోటిపైగా…
ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్లో గూగుల్ భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టనుంది. రానున్న ఐదేళ్ల కాలంలో ఎయిర్టెల్లో గూగుల్ సంస్థ రూ.7,400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎయిర్టెల్లో 1.28 శాతం యాజమాన్య హక్కులను కొనుగోలు చేసేందుకు గూగుల్ ఆసక్తి చూపిస్తోంది. మరో 300 మిలియన్ డాలర్ల మేర ఎయిర్ టెల్తో వాణిజ్య లావాదేవీలను గూగుల్ కుదుర్చుకోనుంది. Read Also: మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్ కాగా 5G నెట్వర్క్, తక్కువ ధరకు…
ప్రీపెయిడ్ పేరుతో 28 రోజుల రీఛార్జ్ విధానం అమలు చేస్తూ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న టెలికాం సంస్థలకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) షాకిచ్చింది. ఇక నుంచి ప్రీపెయిడ్ కస్టమర్లకు గతంలో లాగా 30 రోజులు చెల్లుబాటయ్యే ప్లాన్లు అందించాలని ట్రాయ్ స్పష్టం చేసింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్ ఆర్డర్ 1999కి మార్పు చేస్తూ.. ప్రతి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కనీసం ఒక ప్లాన్ వోచర్, ఒక ప్రత్యేక టారిఫ్ వోచర్, ఒక కాంబో…