దేశంలో గత ఏడాది కాలంగా డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ప్రధాని మోదీ వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఫిన్‌టెక్ ఇన్ఫినిటీ ఫోరంలో మాట్లాడిన ఆయన… గత ఏడాది కాలంలో మొబైల్ చెల్లింపులు మొదటిసారిగా ఏటీఎం నగదు ఉపసంహరణలను మించిపోయాయని ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత ఏడాది కాలంలో సుమారు 6.90 కోట్ల రూపే కార్డులను వినియోగదారులు తీసుకున్నారని… వాటి ద్వారా సుమారు 130 కోట్ల లావాదేవీలు జరిగాయని వివరించారు. Read Also: 2022: కొత్త ఏడాదిలో భారీగా…
2022 ఏడాది రాకముందే సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కొత్త ఏడాదిలో సిమెంట్ ధర మరింత పెరగనుంది. ప్రస్తుతం రూ.385 వరకు పలుకుతున్న 50 కిలోల సిమెంట్ బస్తా ధర మరో రూ.20 పెరగనుందని క్రిసిల్ అంచనా వేసింది. ఇదే జరిగితే గతంలో ఎన్నడూ లేని విధంగా బస్తా సిమెంట్ ధర రూ.400 దాటనుంది. సిమెంట్ తయారీ ధరలో ప్రధాన ముడి పదార్థాలైన బొగ్గు, పెట్‌కోక్‌ల ధరలు ఇటీవల విపరీతంగా పెరగడంతో త్వరలో సిమెంట్ బస్తాల ధరలు…
గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. ప్రతి నెలా మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. తాజా సమీక్షలో భాగంగా కమర్షియల్ (వ్యాపార అవసరాలకు) గ్యాస్ సిలిండర్ ధరను రూ.103.50 మేర ఆయిల్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,174కి చేరింది. అటు హైదరాబాద్ మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,278గా నమోదైంది. కాగా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రం…
ట్విటర్ సీఈవో పదవికి జాక్ డోర్సే రాజీనామా తర్వాత ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. అయితే ఆయన వార్షిక వేతనం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ట్విటర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ ఏడాదికి 1 మిలియన్ డాలర్ల (రూ. 7.5 కోట్లకు పైగా) జీతం పొందుతారని కంపెనీ US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు తెలిపింది. అంతేకాకుండా అగర్వాల్ 1.25 మిలియన్ డాలర్ల (రూ.94 కోట్లు) విలువైన షేర్లను పొందుతారని కూడా వెల్లడించింది.…
నిబంధనలను ఉల్లంఘించినందుకు యూనియన్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. ఇటీవల యూనియన్ బ్యాంక్‌కు సంబంధించి 2019 స్టాట్యూటరీ ఇన్ఫెక్షన్ ఫర్ సూపర్వైజరీ ఎవాల్యూయేషన్‌ను ఆర్బీఐ నిర్వహించింది. ఆర్బీఐ నిబంధనల్లో భాగంగా ఏ బ్యాంకు అయినా కస్టమర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలను లేదా లావాదేవీలకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేయడానికి వీల్లేదు. Read Also: కేవలం 35 పైసలుతో రూ.10 లక్షల ఇన్సూరెన్స్ పొందండి అయితే యూనియన్ బ్యాంక్ ఈ నిబంధనలను ఉల్లంఘించడంతో రూ.కోటి…
ఏపీ, తెలంగాణలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,140గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040గా పలుకుతోంది. వెండి కూడా పసిడి బాటలో స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.700 తగ్గి ప్రస్తుతం రూ.67,200గా నమోదైంది. అటు విజయవాడలో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,140గా.. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ.45,040గా నమోదైంది. కిలో వెండి…
అమెజాన్ ఇండియా సీఈవో అమిత్ అగర్వాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్ మధ్య ఒప్పందంలో భాగంగా విదేశీ పెట్టుబడులను ఉల్లంఘించారని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి అమెజాన్ సీఈవో అమిత్ అగర్వాల్ వచ్చే వారంలో విచారణకు హాజరు కావాలని ఈడీ స్పష్టం చేసింది. Read Also: ‘బిగ్‌బాస్’ నుంచి రవి ఎలిమినేట్.. అసలు ఏం జరిగింది? 2019లో అమెజాన్ కంపెనీ రూ.1400 కోట్ల ఒప్పందంతో ఫ్యూచర్ రిటైల్ గ్రూప్‌లో…
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీ 12 అంకెల UAN నంబరును ఆధార్ కార్డుకు లింకు చేసుకున్నారా? ఇంకా చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. నవంబర్ 30లోగా మీ UAN నంబరును ఆధార్ కార్డుతో లింకు చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేంద్రం విధించిన గడువు కొద్దిరోజుల్లో ముగియనుంది. ఒకవేళ మీ UAN నంబరును ఆధార్‌తో లింకు చేయకపోతే మీరు పని చేసే కంపెనీ మీ ఖాతాలో జమ చేసే మొత్తం…
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త కరోనా వేరియంట్ భారత స్టాక్ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో శుక్రవారం నాడు మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిలో పేకమేడలా కుప్పకూలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,688 పాయింట్లు పతనమై 57,107 వద్ద ముగియడంతో పెట్టుబడిదారుల సంపద రూ.7.45లక్షల కోట్లు ఆవిరైపోయింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ ఏకంగా 510 పాయింట్లు కోల్పోయి 17,026 వద్ద స్థిరపడింది. దక్షిణాఫ్రికా వేరియంట్ భయాలతో ఒక్క భారత సూచీలే కాదు.. దాదాపు ఆసియా సూచీలన్నీ…
దేశంలో పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఇటీవల పెట్రోల్ ధరలను రూ.5 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇప్పుడు గ్యాస్ ధరలను కూడా తగ్గించాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వంట గ్యాస్ సిలిండర్ ధర ఇటీవల కాలంలో రూ.వెయ్యికి చేరింది. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. పలు రాష్ట్రాలలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.312 రాయితీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. Read Also: మగువలకు శుభవార్త……