RTC Bill: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపలేదు. ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక బిల్లు కావడంతో ప్రభుత్వం దానిని గవర్నర్‌కు పంపింది.
KTR: ఐటీ, ఉద్యోగ కల్పనలో తెలంగాణే నెంబర్ వన్ అని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. బెంగుళూర్ ని వెనక్కి నెట్టి ఐటీలో ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ వన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Meera Chopra Slams Those Blaming BJP For Communal Violence In Haryana: బంగారం సినిమాలో పవన్ సరసన నటించి మెప్పించిన హీరోయిన్ మీరా చోప్రా గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి తెలుగులో ఆశించిన అవకాశాలు రాకపోవడంతో తమిళ సినీ పరిశ్రమకి కోలీవుడ్ కు మాకాం మార్చిన ఈ బ్యూటీ గతంలో ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా మళ్ళీ తెలుగు వారిలో గుర్తింపు…
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. తమకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకుల ఆరోపణలకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది.
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రేపు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు కుటుంబ సమేతంగా ఆయన మోడీని కలవనున్నారు. అనంతరం ఎల్లుండి( శుక్రవారం) బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
అందరికీ ఆమోదయోగ్యుడైన బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి గ్రాండ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు తెలంగాణ పాలిటిక్స్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది.
వక్ఫ్ బోర్డు భూములు కబ్జా చేసినట్లు నిరూపించగలరా అని ఆయన సవాల్ విసిరారు. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలను రెచ్చగొడుతున్నారని.. బీఆర్ఎస్ నేతలపై విపక్షాలకు ఎందుకు అంత అక్కసు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
తెలంగాణలో కురిసిన వర్షాలు, వరద ప్రభావంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు బురద రాజకీయాలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు వరదలపై గవర్నర్ ను కలవడాన్ని ఆయన తప్పుబట్టారు.
తెలంగాణాలోని నియంత పాలన అంతం అయ్యే దాకా బీజేపీ నిద్రపోదు అని కమలం పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈ ప్రభుత్వం ఇచ్చేదకా వదలం.. లేదంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక మేమే ఇస్తామని ఆమె అన్నారు.