Kishan Reddy: నాలుగు నెలల్లో ఇల్లు కట్టియ్యండి.. కేంద్ర వాట ఎన్ని కోట్లైన తీసుకొచ్చే బాధ్యత మా పార్టీ ది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణేతరులూ ద్రోహం చేస్తే పొలిమేరలు వరకు తరిమి కొట్టాలని అన్నారు. తెలంగాణ వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతో పాతి పెట్టాలని కాళోజీ అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతుల్లో దగా పడుతుందని అన్నారు. తెలంగాణ తల్లి కేసీఆర్ చేతిలో బంది అయిందని అన్నారు. తెలంగాణ అవినీతి, కుటుంబం, నియంతృత్వ మయం అయిందని తెలిపారు. డబల్ బెడ్ రూం ఇళ్ల హామీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా హామీ ఇచ్చారు కేసీఆర్ అన్నారు. ఎన్నికల ముందు గారడీ చేసే ప్రజలను మభ్య అలవాటు కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాజ్యంలో డబల్ బెడ్ రూం మాటలకే పరిమితమయ్యాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను నమ్మించి గొంతు కోయడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ప్రగతి భవన్, సచివాలయం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లు కట్టుకున్నారు కానీ.. పేదలకు ఇల్లు కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Shamshabad: శంషాబాద్ హత్య కేసు మిస్టరీ వీడింది.. మృతి చెందిన మహిళ మంజుల..!
సొంత జాగా ఉంటే 6 లక్షలు ఇస్తామని అని ఇప్పుడు 3 లక్షలకు అంటున్నాడని తెలిపారు. రేపు మూడు పైసలు కూడా పేద ప్రజలకు ఇవ్వడని అన్నారు. వేసిన శిలా పలకాలని తీసుకెళ్ళి ప్రగతి భవన్ లో దాచి పెట్టారని తెలిపారు. పేద ప్రజల ఇళ్లను కూల్చి మళ్లీ నిర్మించలేదన్నారు. ఈ ప్రభుత్వం ఫార్మ్ హౌస్ కి వెళ్ళడం, కేసీఆర్ గద్దె దిగడం ఖాయమన్నారు. ఈ నాలుగు నెలలు అయిన ఇల్లు కట్టియ్యండి… కేంద్ర వాట ఎన్ని కోట్లు అయిన తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మా పార్టీ ది అని సవాల్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం పోతేనే పేద వారికి ఇల్లు వస్తాయని అన్నారు. డబల్ ఇంజన్ సర్కార్ రావాలని అన్నారు. కేసీఆర్ కి ఫార్మ్ హౌస్… పేదలకు పూరి గుడిసె కూడా లేదన్నారు. పెట్రోల్ డీజిల్ తగ్గించని రాష్ట్రం తెలంగాణ… బాధ్యత కేసీఆర్ సర్కార్ దే అన్నారు. మహిళా పొదుపు సంఘాల ఉసురు కేసీ ఆర్ కుటుంబానికి తగులుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ల ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం వాటాల ప్రభుత్వమన్నారు.
Read also: Koratala Shiva: భోళా దెబ్బకు ట్రెండింగ్‌లో కొరటాల!
ఏ వ్యాపారం చేయాలన్న 30 శాతం బీఆర్ఎస్ నేతలకు ఇవ్వాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలు భూములు, ఆస్తులు కబ్జా చేస్తారు..ప్రజల మీద పడి దోచుకుంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. భూములు అమ్మితే తప్ప పరిపాలన చేయలేని పరిస్థితి అన్నారు. తెలంగాణను ఎలా దోపిడీ చేయాలని 60 వేల పుస్తకాలు చదివారా? అని ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ల ప్రభుత్వాలు చూశారు. మార్పు కోసం బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలని కోరుతున్నానని తెలిపారు. గ్రామ స్థాయి, డివిజన్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు డబల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఆందోళన చేద్దామన్నారు. ధరకాస్తులు తీసుకుందాం.. కేసీఆర్ సర్కార్ కు పాతర వేద్దామన్నారు. మనకి ఇల్లు ఇవ్వలేదు కానీ.. కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ లో కాళ్ళు బార్లా పెట్టుకొని పడుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Charminar: ఛీ..ఛీ.. చార్‌మినార్ పై ఏంట్రా ఇలా చెలరేగిపోతున్నారు..!