ఏపీలో నిధుల కోసం సర్పంచులు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు ఏపీ బీజేపీ మద్దతు ఇచ్చింది. సర్పంచ్ల హక్కుల సాధన కోసం పోరుబాట పడుతున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేయనుంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు.
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలన్నారు.
బీసీలకు బీజేపీ అండగా అంటుందని మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. 1200 మంది బలిదానాల తరువాత తెలంగాణ ఏర్పడిందని.. కేసీఆర్ కు బీసీలంటే ఎందుకంత చిన్న చూపని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో రెండో రోజు చర్చ జరుగుతుంది. మణిపూర్ హింసతో పాటు పలు అంశాలపై తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీయనున్నారు.
బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ట్విట్టర్ వేదిక వైసీపీ ప్రభుత్వం ట్విట్టస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ.. ఏపీలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు. కేంద్రం పంచాయతీలకిచ్చిన నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లించింది. breaking news, latest news, telugu news, big news, daggubati purandeswari, bjp, ycp
కేంద్రంపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ కొనసాగుతోంది. మణిపూర్ అంశంపై గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపక్షాలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి.
ధరణి పేదల కోసం కాదు.. పెద్దల కోసం అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కలెక్టర్లకు టార్గెట్లు పెట్టారు అని ఆయన ఆరోపించారు. చట్ట సభలపై కేసీఆర్ కి నమ్మకం సన్నగిల్లింది.. బడ్జెట్ సమావేశాలు 11 రోజులు.. వర్షాకాల సమావేశాలు 3 రోజులు.. ఈ ఏడాది మొత్తం 14 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగాయని ఆయన అన్నారు.