కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా లోక్ సభలో బీఆర్ఎస్ మాట్లాడుతుందని అని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. అవిశ్వాస తీర్మానాన్ని బీఆర్ఎస్ కూడా ఇచ్చింది.. కేసీఆర్ 9 ఏళ్ల పాలనపై పార్లమెంట్ వేదికగా దేశ ప్రజలకు చెప్తామని ఆయన వెల్లడించారు.
బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మణిపూర్లో ఎన్డీఏ మిత్రపక్షం కుకీ పీపుల్స్ అలయన్స్ (కేపీఏ) మద్దతు ఉపసంహరించుకుంది. కుకీ పీపుల్స్ అలయన్స్(కేపీఏ) అధ్యక్షుడు టోంగ్మాంగ్ హౌకిప్ మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉకేకి లేఖ రాశారు.
మరోసారి సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్న వర్షాలకు నష్టపోయిన రైతులకే ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. ఎకరానికి 10 వేల చొప్పున పరిహారం ఇస్తానని చిటికె వేసిండు .. breaking news, latest news, telugu news, big news, bandi snajay, bjp,
కేసీఆర్ ఎన్నికల తరవాత పత్తా లేకుండా పోతాడు.. ఆర్టీసీ కార్మికులను మోసం చేసేందుకు, ఆర్టీసీ ఆస్తులు అమ్ముకోవడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు.. ఆర్టీసీ కార్మికుల మరణానికి కారణం అయిన మూర్ఖుడు కేసీఆర్ అంటూ బండి సంజయ్ విమర్శించారు.
నేడు ( శుక్రవారం ) ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది అని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ అన్నారు. ఈనెల 6న గాంధీ ఐడియాలోజీ సెంటర్ లో కూడా మీటింగ్ ఉంటుంది అని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగల సినిమా చూపిస్తామన్నాడు.
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ( శుక్రవారం ) ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే, వాళ్లిద్దరూ లోపాయికరిగా కలిసి పని చేస్తున్నారు. అసెంబ్లీ పరిధిలో కూడా ఒక ప్రత్యేక ప్రణాళికతో అక్కడి సమస్యలపై పోరాడాలి అని ఠాక్రే అన్నారు.
రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తుది తీర్పులో కూడా సరైన నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ ఇంటి పేరు పరువు నష్టం దావా కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Minister KTR: ఎస్ ఆర్ డీపీ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంలో హైదరాబాద్ నగరంలో ఎస్ ఆర్ డీపీ పనుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.