లోక్‌సభలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ (శుక్రవారం) కాసేపు సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. లోక్‌సభ లో కాంగ్రెస్ పార్టీ పక్షనేత అధిర్ రంజన్ పై సస్పెన్షన్ వేయడంపై విపక్షాలు సభలో ఇవాళ నిరసన బాట పట్టాయి. లోక్ సభ ప్రారంభం కాగానే అధిర్ రంజన్ పై వేటును ఎత్తివేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ విషయంపై లోక్ సభలో విపక్షాల పార్టీలు ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్ లోక్ సభను కాసేపు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Viral Video: టీచరమ్మ నువ్వు గ్రేట్… ప్రతి ఆడపిల్ల చూడాల్సిన వీడియో!
నిన్న ( గురువారం ) లోక్ సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీ సూచన మేరకు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఇదే విషయంపై రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు.
Read Also: Ongole Bulls: తెలంగాణ నుంచి ఏపీకి ఒంగోలు గిత్తలు.. రికార్డ్ స్థాయి ధర పెట్టి కొనుగోలు..!
దీంతో పార్లమెంట్ లో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. విపక్షాల తీరుపై అధికార బీజేపీ పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా విమర్శించడం పద్దతి కాదని వారు కౌంటర్ అటాక్ కు దిగారు. అయితే.. నిన్న(గురువారం) మణిపూర్ సమస్యపై మోడీ జీ ‘నీరవ్’ అని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. నా ఉద్దేశ్యంలో ప్రధాని మోడీని నేను అవమానించలేదు అని అధిర్ రంజన్ చౌదరి అన్నారు.