కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా కరీంనగర్ జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్‌లో చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత వారోత్సవాలకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ మరో సారి హాట్ కామెంట్స్ చేశారు. జమ్మికుంట కు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తానని, ఎన్ని కోట్లు అయిన సరే నాయిని చెరువుకు మహర్ధశ తీసుకు వస్తానన్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఎమ్మార్వో, ఎంపీడీఓ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అధునాతన పద్దతిలో నిర్మాణం చేపడుతామని, జమ్మికుంట నడి బొడ్డులో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి తొలగిస్తామన్నారు. నూతన బ్రిడ్జి నిర్మాణం చేపడుతామని ఆయన వెల్లడించారు.
Also Read : Home Loans: ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ .. హోమ్‌లోన్ ఫిక్స్‌డ్ వడ్డీ రేట్లను మార్చుకోవచ్చు
ఒక్క సారి ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించండని ఆయన అన్నారు. అంతేకాకుండా.. మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండని, ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. స్వరాష్ట్రంలో చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని, పద్మశాలీ కులస్థుల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామన్నారు పాడి కౌశిక్ రెడ్డి. నాడు ఇతర రాష్ర్టాలకు వలసలు పోయిన చేనేత కార్మికులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిరిగి వస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో చేనేతలు గొప్పగా బతుకుతున్నారని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆలోచనలు అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధికి దోహదం పడుతున్నాయని కౌశిక్ రెడ్డి అన్నారు.
Also Read : Blue Berries :బ్లూ బెర్రీ సాగులో మెళుకువలు.. ఆదాయం లక్షల్లో..