Perni Nani: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరి పాలన చూస్తుంటే ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని అన్నారు.
Digvijaya Singh: బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఎప్పుడూ విమర్శించే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, తాజాగా ఈ సంస్థలపై ప్రశంసలు కురిపించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని రాహుల్ గాంధీకి లేఖ రాసిన వారం తర్వాత కొత్త వివాదానికి తెర లేపారు. 1990ల నాటి ప్రధాని మోడీ, అద్వానీల బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ, బీజేపీ దాని సైద్ధాంతిక మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై ప్రశంసించారు.
ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఈ ఎన్నికలు ప్రధానంగా అధికార పార్టీకి చాలా కీలకం. అదే తరుణంలో శివసేన (యూబీటీ)కి కూడా అంతే ప్రాధాన్యం. ఇప్పటికే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో భారీ విజయ నమోదు కావడంతో కూటమి ప్రభుత్వం మంచి జోష్‌లో ఉంది. ముంబైను కూడా సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది.
Rahul Gandhi: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘‘ఉన్నావ్ అత్యాచారం’’ కేసులో దోషిగా తేలిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు ఉపశమనం ఇచ్చింది. సెంగార్ ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణల్ని, జైలు శిక్షను సవాల్ చేశాడు. హైకోర్టు సెంగార్ శిక్షను నిలిపివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఇప్పటికే 7 ఏళ్ల 5 నెలల జైలు శిక్ష పూర్తి చేయడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. విదేశాల్లో దేశ ప్రతిష్టతను దెబ్బతీసేలా వ్యవహరించడం రాహుల్‌గాంధీకి అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. భారత్‌ను అవమానించేందుకే రాహుల్‌గాంధీ విదేశాల్లో పర్యటిస్తున్నారన్నారు.
భారత్‌లో అధికార పార్టీకి ఈడీ, సీబీఐ ఆయుధాలు అని.. వారిపై ఒక్క కేసు కూడా లేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.
Mohan Bhagwat: పోలికల ద్వారా, రాజకీయ కోణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను అర్థం చేసుకోవడం తరుచుగా అపార్థాలకు దారి తీస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం అన్నారు. కోల్‌కతాలో జరిగిన ‘‘ఆర్ఎస్ఎస్ 100 వ్యాఖ్యాన మాల’’ కార్యక్రమంలో ఆయన పఈ కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్ ను కేవలం మరో సేవా సంస్థగా చూడటం సరికాదని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ను కేవలం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో ముడిపెట్టవదని ఆయన చెప్పారు. చాలా మంది సంఘ్‌ను బీజేపీ కోణం…
PM Modi: గౌహతి విమానాశ్రయం కొత్త టెర్మినల్‌ను శనివారం ప్రధాని నరంద్రమోడీ ప్రారంభించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నంత కాలం అస్సాం, ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, ఈ ప్రాంత భద్రత, గుర్తింపును పణంగా పెట్టి చొరబాటుదారుల్ని రక్షించిందని ఆరోపించారు.