తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంటే కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్నారు అని బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇక్కడ ప్రజలు మునిగిపోతుంటే, కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాల్లో మునిగి పోయారు.. ముఖ్యమంత్రి నిద్ర లేస్తేనే యంత్రాంగం లేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
Kishan Reddy: హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ నేత జి.కిషన్ రెడ్డి పర్యటించారు. యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, అంబర్పేటలో ప్రస్తుత పరిస్థితిని తెలియజేసి మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు పొంగిపొర్లడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్కు పదోన్నతి లభించింది. పాలనా యంత్రాంగం ఆయనకు కీలక పదవిని అప్పగించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ను నియమిస్తూ జాతీయ నాయకత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.
"మహాభారతంలో కూడా లవ్ జిహాద్ జరిగింది" అని సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఆయన సాధారణ ప్రజలను క్షమాపణ అడగడానికి వైష్ణవ్ ప్రార్థనకు సంబంధించిన ఓ గీతాన్ని కూడా పాడాడు.
ప్రతిపక్ష కూటమి 'ఇండియా'(ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్) తన మూడో సమావేశాన్ని ఆగస్టు 15 తర్వాత లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ముంబైలో నిర్వహిస్తుందని కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే శుక్రవారం ప్రకటించారు.
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతరీ మారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులా.. బాబుగారు జనతా పార్టీకి అధ్యక్షులో చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. మరిది గారు స్కిప్ట్ చిన్నమ్మ మాట్లాడింది అని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఎక్కడకు వెళ్లిన ఇదే సినిమా స్క్రిప్టు.. తండ్రి పార్టీ మరిది నడుపుతారు.. వీరు వేరే పార్టీని నడుపుతారు.. టీడీపీలో చేరి అధ్యక్ష బాధ్యతలు పురందేశ్వరి తీసుకుని మాట్లాడితే బాగుండేది…
ఉడిపి కాలేజీ కేసుకు సంబంధించి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులపై ట్వీట్ చేసినందుకు గానూ బీజేపీ కార్యకర్తపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది.