మెదక్ జిల్లా కొల్చారంలో జరిగిన మహిళ హత్యాచారం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. జిల్లా పోలీసులు నిందితుడిని ఫకీర్ నాయక్ గా గుర్తించి, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఆ రిజర్వుడ్ నియోజకవర్గంలో పదవుల పంచాయితీ పతాక స్థాయికి చేరిందా? ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కొందరు నాయకులు పావులు కదుపుతున్నారా? మేటర్ తెలిసి… మీ సంగతి అలా ఉందా….? అంటూ శాసనసభ్యుడు కూడా పావులు కదుపుతున్నారా? ఎక్కడ జరుగుతోందా రసవత్తర రాజకీయం? అందులో సూత్రధారులెవరు? పాత్రధారులెవరు? దేవరకొండ దంగల్ పీక్స్‌కు చేరుతోంది. పేరుకు ఇది ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం అయినా…. పెత్తనం మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలను శాసించే సామాజికవర్గాలదేనన్నది బహిరంగ రహస్యం. అధికారంలో ఎవరున్నా, […]
మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని గురుకులాలపై కొనసాగుతున్న సమస్యలను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని చెప్పిన మాటలు నీటి మూటలాగా మారాయని, కేటాయించిన నిధులు సిబ్బంది వేతనాలు, వసతి గృహాల మరమ్మతులు, అత్యవసర పనుల కోసం సరైన విధంగా ఉపయోగించబడలేదని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ డీఎస్పీ ప్రభాకర్ రావు సిట్ అధికారులు కోరిన సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Kalvakuntla Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ యాత్ర పేరిట రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో యాత్ర చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అక్టోబర్ చివరి వారంలో తెలంగాణ యాత్ర ప్రారంభించనున్న కవిత తెలిపారు. ఇదిలా ఉంటే.. యాత్ర పోస్టర్లలో కేసీఆర్ ఫోటో లేకుండా, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. Masala Fraud : మసాలాల్లో ఎలుకల మలం.. తనిఖీల్లో షాకింగ్ నిజాలు..! […]
రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మసాలా తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. 30కి పైగా మసాలా మాన్యుఫాక్చరింగ్, ప్యాకింగ్ సెంటర్స్‌పై ఈ దాడులు నిర్వహించగా, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పాటించకుండా స్పైసెస్ తయారు చేస్తున్న సెంటర్లను గుర్తించారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజలు భారత రాష్ట్ర సమితికి (బీఆర్ఎస్) గట్టి బుద్ధి చెప్పబోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ఆ పార్టీ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి పరంగా ఏ మాత్రం ముందుకు సాగలేదని, ఇప్పుడు ప్రజలే ఆ విఫలతకు తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు. CM Chandrababu Tweet: సాంకేతిక పరంగా చారిత్రాత్మక మైలు రాయిని అధిగమించాం.. భారత్ ఏఐ ప్రయాణం ప్రారంభం.. అంతేకాకుండా.. “జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ […]
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు మరోసారి తన దాడితో సంచలనాన్ని సృష్టించారు. భూమి సర్వే కోసం లంచం తీసుకుంటుండగా సిరిసిల్ల మండల సర్వేయర్ వేణును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇరుకుల ప్రవీణ్ అనే వ్యక్తికి చిన్న బోనాలలో మూడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని సర్వే చేయడంలో భాగంగా సర్వేయర్ వేణు రూ.30 వేలు […]
Srinivas Goud : తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లకు మానవత్వం ఉందా? వాళ్లు మనుషులేనా? అని ప్రశ్నించారు. ఆడబిడ్డ అయిన మాగంటి సునీతను అవమానించడం ఎంతవరకు సమంజసం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపన్న అమర్ రహే అంటుంటే, తన భర్త గోపినాథ్‌ను గుర్తు చేసుకొని మాగంటి సునీత […]