భారత్ కూడా అమెరికా వెనిజువెలాను చేసినట్లు చేయాలి.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు..
వెనిజువెలా అధ్యక్షుడు నికోలాస్ మడురోను అమెరికా సైన్యం సొంత దేశంలోనే పట్టుకుని అమెరికాకు తీసుకెళ్లిన ఘటనను ప్రస్తావిస్తూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే తరహాలో 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారులను కూడా భారత్‌కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కారకాస్‌లో జరిగిన అమెరికా సైనిక దాడిలో మడురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించిన సంగతి తెలిసిందే. డ్రగ్ ఉగ్రవాదానికి సంబంధించిన కేసుల్లో ఆయనపై విచారణ జరగనుంది.
40 ఏళ్ల తర్వాత సౌత్ ఇండియా నుండి సైలెంట్ ఫిల్మ్
వర్సటైల్ అంటే విక్రమ్‌లా గుర్తుపట్టకుండా గెటప్ మార్చనక్కర్లేదు సూర్యలా మేకోవర్ కానవసరం లేదు. జస్ట్ కథలో కొత్తదనం, నటనలో వైవిధ్యం చూపించొచ్చని ఫ్రూవ్ చేస్తున్నాడు విజయ్ సేతుపతి. ఏజ్‌కు తగ్గ సినిమాలు చేస్తూ మరో వైపు విలన్స్‌గానూ మెప్పిస్తున్నాడు ఈ స్టార్ హీరో. స్టోరీల్లో ఎక్స్‌పరిమెంట్ చేసే మక్కల్ సెల్వన్..మరో ప్రయోగానికి రెడీ అయ్యాడు. ఎప్పుడో కాలం చెల్లిపోయిన మూకీ సినిమాను తెస్తున్నాడు. 2021లో సేతుపతి ఎనౌన్స్ చేసిన సెలైంట్ మూవీ గాంధీ టాక్స్. షూటింగ్‌కు కొన్నాళ్ల క్రితమే గుమ్మడికాయ కొట్టేశారు. 2023 ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది కూడా. కానీ థియేటర్లలో రిలీజ్‌కు నోచుకోవడం లేదు. ఇన్నాళ్లకు మాటలు లేని సినిమాకు మోక్షం దక్కంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న గాంధీ టాక్స్ జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అరవింద్ స్వామి, అదితిరావ్ హైదరీ, సిద్దార్థ్ జాదవ్ కీ రోల్స్ పోషించిన ఈ మూకీ సినిమాకు కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకుడు. కమల్ హాసన్-అమల నటించిన పుష్పక విమానం తర్వాత ఇలాంటి సైలెంట్ మూవీ మరో సౌత్ హీరో, దర్శకుడు చేయలేదు. 1987లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన పుష్పక విమానం అప్పట్లో పాన్ ఇండియాగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కోటి రూపాయలను కొల్లగొట్టింది. మళ్లీ ఇన్నాళ్లకు అంటే దాదాపు 40 ఏళ్లకు విజయ్ సేతుపతి ఇలాంటి ప్రయోగానికి రెడీ అయ్యాడు. డబ్బు అనే కాన్సెప్ట్ చుట్టూ తిరగబోతుంది గాంధీ టాక్స్. మరీ ఈ ఎక్స్ పరిమెంట్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే జనవరి ఎండింగ్ వరకు ఆగాల్సిందే.
మన శంకర వరప్రసాద్ గారు’..చిరు, వెంకీల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
ఈ సంక్రాంతికి థియెటర్‌లు కళకళలడబోతున్నాయి. అందులో ముఖ్యంగా చిరు మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం మాత్రం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్స్ స్వింగ్‌లో ఉన్న ఈ సినిమా బడ్జెట్ మరియు రెమ్యూనరేషన్ల వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాను సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా, ప్రమోషన్ ఖర్చులతో కలిపి అది రూ.250 కోట్ల వరకు చేరిందని అంచనా. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన స్పెషల్ అప్పీయరెన్స్‌లో మెరవబోతున్నారు. కాగా
వెనిజులా ‘‘చమురు’’ కోసమే ట్రంప్ ఇదంతా చేస్తున్నాడు.. మదురో అరెస్ట్‌పై కమలా హారిస్..
వెనిజులాపై అమెరికా దాడి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యని బంధించడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఇజ్రాయిల్, అర్జెంటీనా వంటి కొన్ని దేశాలు ట్రంప్ చర్యల్ని సమర్థించగా.. చైనా, ఇరాన్, రష్యా వంటి దేశాలు యూఎస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇదిలా ఉంటే, సొంత దేశంలోని ప్రతిపక్షం నుంచి కూడా ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. డెమెక్రాట్ నేత కమలా హారిస్‌తో పాటు న్యూయార్క్ కొత్త మేయర్ జోహ్రాన్ మమ్దానీ ట్రంప్‌ను తీవ్రంగా తప్పుపట్టారు. మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్రంగా స్పందించారు. ఈ చర్య ప్రజాస్వామ్యం లేదా డ్రగ్స్ నియంత్రణ కోసం కాదని, పూర్తిగా చమురు కోసమని ఆమె ట్రంప్‌పై ఆరోపణలు గుప్పించారు. చమురు కోసమే, ట్రంప్ రాజకీయ ఆశయాల కోసమే ఇది జరిగిందని ఆరోపించారు. ఈ చర్యల వల్ల అమెరికా సురక్షితంగా మారదని ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. బలవంతంగా ప్రభుత్వాన్ని మార్చడం ప్రాంతీయ అస్థిరతకు కారణమై, చివరకు అమెరికన్ల ప్రాణాలకే ముప్పు తెస్తుందని ఆమె హెచ్చరించారు. మదురో ఒక క్రూరమైన నియంత అయినా సరే, ఈ చర్య చట్టవిరుద్ధమని అన్నారు. ప్రభుత్వ మార్పు లేదా చమురు పేరుతో ప్రారంభమైన యుద్ధాలు గందరగోళంగా మారి, చివరకు అమెరికన్ కుటుంబాలే బలవుతున్నాయని అన్నారు.
వెనిజువెలాపై అమెరికా దాడులు.. భారత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. ఆ దేశానికే మద్దతు
వెనిజువెలాపై అమెరికా చేపట్టిన సైనిక దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు జనవరి 4, 2026న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో తెలిపింది. వెనిజువెలా ప్రజల భద్రత, సంక్షేమానికి భారత్ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేసింది. సమస్యలను శాంతియుతంగా, సంభాషణల ద్వారానే పరిష్కరించుకోవాలని అన్ని పక్షాలకు పిలుపునిచ్చింది. వెనిజువెలాలో శాంతి, స్థిరత్వం కొనసాగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాగే కారకాస్‌లోని భారత రాయబారం అక్కడ ఉన్న భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, అవసరమైన సహాయాన్ని అందిస్తామని వెల్లడించింది.
విమానాల్లో “పవర్ బ్యాంక్స్” తీసుకెళ్తున్నారా.?, మారిన రూల్స్ తెలుసుకోండి.
పవర్ బ్యాంకులు, లిథియం అయాన్ బ్యాటరీతో నడిచే పరికరాల వాడకంపై విమాన భద్రతా నిబంధలను మారాయి. వీటి వల్ల ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉందని సూచిస్తూ ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా లిథియం బ్యాటరీల వల్ల వేడెక్కడం లేదా మంటలు చెలరేగడం వంటి సంఘటనల తర్వాత విమానంలో ప్రయాణించే సమయంలో ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఛార్జింగ్ చేయడానికి పవర్ బ్యాంకులను వాడటాన్ని నిషేధించింది. విమానంలో సీట్ల వద్ద ఉండే ఛార్జింగ్ పాయింట్ల వద్ద కూడా వీటిని ఛార్జ్ చేయాడాన్ని బ్యాన్ చేసింది.
మరో బస్సు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టవేరా.. పలువురికి తీవ్ర గాయాలు
ఇటీవల చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెట్‌పల్లి మండలం మేడిపల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సును టవేరా ఢీకొట్టింది. మెట్‌పల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టవేరా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి టవేరా వెహికల్ నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో టవేరా వాహనంలో ప్రయాణిస్తున్న కోరుట్లకు చెందిన పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కర్ణాటక లోని గన్గాపూర్ దేవాలయానికి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం..
కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడించిన కాంగ్రెస్ నేతలు
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్‌హౌస్ వద్ద రాజకీయ సెగ రాజుకుంది. గజ్వేల్ నియోజకవర్గ ప్రతినిధిగా ఎన్నికైన కేసీఆర్, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై జిల్లా కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారు భారీ ఎత్తున తరలివచ్చి ఫామ్‌హౌస్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం, అసెంబ్లీలో ప్రజా గొంతుక వినిపించాల్సిన బాధ్యతను ఆయన విస్మరించడం సరికాదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
లక్ష్మీదేవి పూజలతో డబ్బులు డబుల్.. తండ్రీకొడుకులకు రూ. 50 లక్షల బురిడీ..!
అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, అత్యాశను ఎరగా వేసి అమాయకులను దోచుకునే కేటుగాళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లాలో లక్ష్మీదేవి పూజల పేరుతో రూ. 50 లక్షలు కాజేసిన ఒక ముఠా ఉదంతం కలకలం రేపుతోంది. మహారాష్ట్రకు చెందిన ఒక కిలాడీ ముఠా మాయమాటలు నమ్మి, తండ్రీకొడుకులు తమ వద్ద ఉన్న భారీ మొత్తాన్ని పోగొట్టుకున్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులకు పరిచయమైన మహారాష్ట్ర ముఠా, తమకు కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయని నమ్మించింది. ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే, దగ్గర ఉన్న నగదు రెట్టింపు (డబుల్) అవుతుందని నమ్మబలికారు. ఈ మాయమాటలకు ఆకర్షితులైన తండ్రీకొడుకులు, తమ వద్ద ఉన్న రూ. 50 లక్షలను రెట్టింపు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ముఠాను సంప్రదించారు.