UPI Creates History : భారతదేశంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి. 2025 ఏడాదిని ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్’ (UPI) సరికొత్త రికార్డులతో ముగించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గతేడాది యూపీఐ లావాదేవీలు విలువ , సంఖ్య పరంగా ఆల్-టైమ్ హై రికార్డును నమోదు చేశాయి.
High Return Shares : వారంలోనే కాసుల వర్షం.. 91% వరకు లాభాలను అందించిన 5 Top Stocks..!
చిన్న లావాదేవీల విప్లవం:
గణాంకాల ప్రకారం, సగటు లావాదేవీ విలువ (Average Ticket Size) తగ్గడం విశేషం. 2024లో రూ. 1,478గా ఉన్న సగటు విలువ, 2025 నాటికి రూ. 1,293కి పడిపోయింది. దీని అర్థం ప్రజలు కేవలం పెద్ద మొత్తాలకే కాకుండా, టీ కొట్లు, కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్ల వద్ద అతి తక్కువ మొత్తాల చెల్లింపులకు కూడా యూపీఐని విరివిగా ఉపయోగిస్తున్నారు.
ప్రపంచంలోనే నంబర్ వన్:
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో భారత్ వాటా 49 శాతానికి చేరింది. బ్రెజిల్, చైనా, థాయ్‌లాండ్ వంటి దేశాల కంటే భారత్ ఎంతో ముందంజలో ఉంది. ప్రస్తుతం దేశంలో సగటున రోజుకు 69.8 కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి.
పెరిగిన నెట్‌వర్క్:
దేశవ్యాప్తంగా క్యూఆర్ (QR) కోడ్‌ల సంఖ్య గత ఏడాదిలో 111 శాతం పెరిగి 678 మిలియన్లకు చేరుకుంది. టైర్-2, టైర్-3 పట్టణాలు , గ్రామాల్లో కూడా యూపీఐ వినియోగం విపరీతంగా పెరగడం డిజిటల్ ఇండియా విజయానికి నిదర్శనం. ‘యూపీఐ ఆటోపే’, ‘యూపీఐ లైట్’, , ‘క్రెడిట్ ఆన్ యూపీఐ’ వంటి కొత్త ఫీచర్లు ఈ వృద్ధిని మరింత వేగవంతం చేశాయి. మొత్తానికి, 2025లో భారతీయుల దైనందిన ఆర్థిక జీవనంలో యూపీఐ ఒక విడదీయలేని భాగంగా మారిపోయింది. రాబోయే 2026-27 నాటికి రోజుకు 100 కోట్ల లావాదేవీల లక్ష్యాన్ని చేరుకోవాలని ఎన్పీసీఐ (NPCI) భావిస్తోంది.
IAS: ఐఏఎస్ కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద మృతి..