సమాజాన్ని మార్చే ఏకైక ఆయుధం విద్య. ముఖ్యంగా సమాజంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జీవితాలు మారాలన్నా అందరితో సమానంగా అవకాశాలు దక్కించుకోని వృద్ధిలోకి రావాలన్నా ఆయా వర్గాలను విద్యా వంతులను చేయడమే ఏకైక మార్గమని మహాత్మా జ్యోతిబాపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహానీయులు విశ్వసించడమే కాదు అందుకోసం ఎంతో కృషి చేశారు. ఆ మహానీయుల స్ఫూర్తిని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. బీసీ రిజర్వేషన్లను పెంచడం, ఎస్సీ వర్గీకరణ వంటి విధాన నిర్ణయాలకే […]
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్ల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సెక్రటేరియట్లో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఢిల్లీలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎన్టీవీతో మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఎంపిక ప్రక్రియ తెలంగాణలో ప్రారంభమైందన్నారు.
మేడారం సమ్మక్క సాక్షిగా… కాంగ్రెస్‌లోని కుమ్ములాటలు బయటపడుతున్నాయా? మంత్రుల మధ్య ఆధిపత్య పోరు పీక్స్‌కు చేరి ఢిల్లీలో పితూరీలు చెప్పుకునేదాకా వెళ్ళిపోయిందా? జరుగుతున్న వ్యవహారాలపై చివరికి ముఖ్యమంత్రి కూడా అసహనంగా ఉన్నారా? ఏయే మంత్రుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది? దాని ప్రభావం మేడారం జాతర పనులపై ఎలా పడుతోంది? మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ రగడ జగడ కంటిన్యూ అవుతోంది. ఆయన ఇన్ఛార్జ్ మంత్రి అయితే కావచ్చుగానీ… జిల్లా మీద పెత్తనం ఏంటని […]
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
ఖైదీల సంక్షేమంలో చర్లపల్లి జైలులో చేపడుతున్న సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఖైదీలకు బీమా సౌకర్యం కల్పించడంతోపాటు, వారి కుటుంబ సభ్యులకు వడ్డీలేకుండా రుణ సదుపాయం కల్పించడం అభిందనీయమన్నారు. మహిళా ఖైదీల పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదవిస్తూ ఫీజులను కూడా జైళ్ల శాఖ చెల్లించడం గొప్ప విషయమన్నారు. ఈ విషయంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విజన్ ను అభినందించకుండా ఉండలేమన్నారు. కస్టడీ-కేర్-కరక్షన్ కు […]
హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ లో ప్రజల సపోర్ట్ స్పష్టంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఉందని, వందశాతం ఘన విజయం సాధించబోతోందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో పోట్ల గిత్తల్ని ఆపేవాళ్ళు లేరా? ఎవరికి వారు కట్లు తెంచుకున్నట్టు నోటికి పని చెబుతూ చెలరేగిపోవడమేనా? చివరికి మంత్రులు సైతం కట్టు తప్పుతున్నా… కంట్రోల్ చేసే దిక్కు లేకుండా పోయిందా? చివరికి మంత్రులతో సహా… మొత్తం ప్రభుత్వమే పలుచన అవుతున్నా… పెద్దలు ఎవ్వరూ ఎందుకు రియాక్ట్ అవడంలేదు? అధికార పార్టీలో అసలేం జరుగుతోంది? తెలంగాణలో మంత్రుల వ్యవహారం రోజురోజుకు శృతిమించుతున్నట్టు కనబడుతోంది. ఎవరికి వారు అసలు పని వదిలేసి.. ఇష్టా రాజ్యాంగా మాట్లాడేస్తున్నారన్న […]
ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలోని మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వెళ్లిన ఒక విద్యార్థి, స్కూల్లో పనిచేస్తున్న జువాలజీ టీచర్ లైంగికంగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు తెలిపాడు.
తెలంగాణ మొత్తం ఒక రూల్, మునుగోడు నియోజకవర్గంలో మాత్రం మరో రూలా? ఏ… బిడ్డా… ఇది నా అడ్డా…. ఇక్కడ నా మాటే శాసనం అంటూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సొంత రాజ్యాంగం అమలు చేస్తున్నారా? ఏ విషయంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విధానాన్నే సవాల్ చేస్తున్నారు? అందుకు ఆయన చెబుతున్న రీజన్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్ లీడర్స్‌లో ఒకరైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సరికొత్త వివాదానికి తెర లేపారు. తన నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు […]