Telangana Cabinet : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ విద్యుత్ అవసరాలు, పరిశ్రమల వృద్ధి, నగర పాలన సంస్కరణలు, మౌలిక సదుపాయాల విస్తరణ.. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేబినెట్ విస్తృత చర్చలు జరిపింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ వేగంగా పెరుగుతున్న అర్బన్ అభివృద్ధిని క్రమబద్ధీకరించేందుకు, విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకున్న నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1. […]
ప్రపంచానికి శాంతి, శ్రేయస్సును ఇచ్చిన ధ్వజం శిఖరమెక్కింది భారతీయులందరికీ ఈరోజు ముఖ్యమైన రోజు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రధాని మోడీతో కలిసి ఆయోధ్య రామాలయంపై కాషాయ జెండాను మోహన్ భగవత్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈరోజు భారతీయుల కల నెరవేరిన రోజు అని పేర్కొన్నారు. రామ మందిరం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని.. ఈరోజు వారి ఆత్మలు సంతోషంగా ఉంటాయని చెప్పారు. మహంత్ రామచంద్ర దాస్ మహారాజ్, వీహెచ్‌పీ నేత దాల్మియా, […]
IBomma Ravi Case : ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలను హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. రవిని పోలీసులు ఎలా ట్రాప్ చేశారు, అతనికి అనుమానం రాకుండా ఎలాంటి ఈ-మెయిల్స్ పంపించారు, రవిని హైదరాబాద్‌కి రప్పించేందుకు ఎలా వ్యూహం రచించారు వంటి కీలక అంశాలను ఆయన వివరించారు. అలాగే ఐబొమ్మ రవి అకౌంట్లకు డబ్బులు ఎలా వచ్చాయి, యాడ్ కంపెనీల పాత్ర ఏమిటన్నది కూడా ప్రజెంటేషన్‌లో స్పష్టమైంది. […]
Mule Accounts : హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరిగిన సైబర్ మోసాన్ని నగర పోలీసులు బట్టబయలు చేశారు. అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి వద్దకు అనుమానాస్పద కాల్ రావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ‘బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇస్తే డబ్బులు ఇస్తాం’ అని ఎవరో తనను సంప్రదిస్తున్నారని ఆ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆధారంతో ముందుకు సాగిన విచారణలో రాజస్థాన్‌కు చెందిన కన్నయ్య […]
సంగారెడ్డిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. తన స్థానంలో భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేయనున్నారని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పినా కూడా తాను మళ్లీ పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. “సంగారెడ్డి ప్రజలు జగ్గారెడ్డిని ఓడించినా ఇంట్లో కూర్చోను. పదేళ్లుగా అధికారం లేకున్నా సర్పంచ్, ఎంపీటీసీ, […]
Chicken Waste Racket : హైదరాబాద్‌లో మరో పెద్ద అక్రమ రవాణా రాకెట్ బట్టబయలైంది. అత్తాపూర్‌లోని పౌల్ట్రీ యూనిట్లలో ఏర్పడే కూల్లిన చికెన్ వ్యర్థాలను జీహెచ్ఎంసీ రెండరింగ్ ప్లాంట్‌కి తరలించకుండా, వాటిని నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, భీమవరం వంటి ప్రాంతాల్లోని చేపల వ్యాపారులకు విక్రయిస్తున్న ముఠా పోలీసుల దృష్టికి వచ్చింది. సాధారణంగా శుభ్రపరచి, ప్రాసెస్ చేయడానికి రెండరింగ్ ప్లాంట్‌కు వెళ్లాల్సిన ఈ వ్యర్థాలు, ముఠా లాభాల కోసం అనధికారికంగా రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లుతున్నాయి. YS Jagan […]
ఐ బొమ్మ రవి కేసు దర్యాప్తులో బయటపడిన అంశాలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. పోలీసులు రివీల్ చేసిన కన్ఫెషన్ రిపోర్ట్ ప్రకారం, రవి తొలి నుంచే క్రిమినల్ మెంటాలిటీతో వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నేర స్వభావం ఉండడమే కాకుండా, స్నేహితుడు నిఖిల్ పేరుతో నమోదు చేసిన ఐడీ కార్డులను ఉపయోగించి అక్రమ కార్యకలాపాలు కొనసాగించినట్టు పోలీసులు గుర్తించారు. రవి నడవడి, అతని బ్యాక్‌గ్రౌండ్ గురించి కీలక వివరాలు కూడా బయటపడ్డాయి. దర్యాప్తులో భాగంగా రవి భార్యను కూడా […]
ఆ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికలో కాంగ్రెస్ పెద్దలు ఎందుకు ఒక నిర్ణయానికి రాలేకపోయారు? పైగా కత్తి మీద సాములా మారిందని ఎందుకు ఫీలవుతున్నారు? జిల్లాకు చెందిన మంత్రి, సీనియర్ లీడర్ ఒక మాట మీదికి వచ్చి ఓకే అన్నా… వాళ్ళు చెప్పిన వ్యక్తికి ఎందుకు పదవి దక్కలేదు? కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ప్రభావం పడిందా? మంత్రి మాట సైతం నడవనంతగా ఏం జరిగింది? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? తెలంగాణలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవుల్ని […]
CM Revanth Reddy : వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని ఎన్కేపల్లి రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వ కట్టుబాటును స్పష్టం చేస్తూ, ముందున్న పది సంవత్సరాలు ‘ఇందిరమ్మ రాజ్యం’గా నిలుస్తాయని సీఎం ప్రకటించారు. అభివృద్ధి పనులను రాజకీయాలకు అతీతంగా కొనసాగిద్దామని ప్రజలను పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రూ. 5 వేల కోట్లతో మక్తల్-నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం […]
కార్పొరేషన్ ఛైర్మన్స్‌గా ఇన్నాళ్ళు కూల్ కూల్‌గా పొజిషన్ ఎంజాయ్ చేసిన ఆ నేతలకు ఇప్పుడో కొత్త టెన్షన్ పట్టుకుందట. అదనంగా దక్కిన పోస్ట్ వాళ్ళని కంగారు పెడుతోందట. ఉన్నదానికి అదనంగా మరో పదవి దక్కితే ఇంకా హ్యాపీగా ఫీలవ్వాల్సిన నాయకులు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఎవరా నాయకులు? ఎందుకా కంగారు? తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడో కొత్త టెన్షన్లో ఉన్నారు. అనూహ్యంగా ఓ పదవి వచ్చిందిగానీ… దాని దెబ్బకు ఉన్న పోస్ట్ ఊడుతుందా ఉంటుందా? అంటూ చాలామంది […]