Aadi Srinivas : తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం బీఆర్ఎస్ శ్రేణుల్లో, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో ప్రకంపనలు సృష్టిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని లోపాలను, అవినీతిని ముఖ్యమంత్రి ఎండగట్టడంతో కేటీఆర్, హరీష్ రావులకు ఏం చేయాలో పాలుపోవడం లేదని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీని ఉరి తీయాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆది శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుమారుడిని ఉరి తీయాలని అనడం కేటీఆర్ నీచ మనస్తత్వానికి, విశ్వాసఘాతకానికి నిదర్శనం. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే రకం నీది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంపదను దోచుకున్న వారిని ఉరి తీసినా తప్పులేదని రేవంత్ రెడ్డి అన్నది కేవలం అవినీతి తీవ్రతను చెప్పడానికే తప్ప, ఎవరి చావును కోరుకోవడం కాదని ఆయన స్పష్టం చేశారు.
Pakistan: పాకిస్తాన్‌ను కుదిపేస్తున్న కొత్త సంక్షోభం..
కేసీఆర్ చావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడూ కోరుకోలేదని, కేసీఆర్ కాలు విరిగినప్పుడు స్వయంగా వెళ్లి పరామర్సించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని ఆది శ్రీనివాస్ హితవు పలికారు. మానవత్వం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదని ఆయన దుయ్యబట్టారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని ‘సర్వభ్రష్ట ప్రభుత్వం’ అని కేటీఆర్ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. “మీది పదేళ్ల పాటు సాగిన ‘సర్వస్వాహా’ ప్రభుత్వం. అందుకే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంటికి సాగనంపారు. కేటీఆర్ తన అసహనాన్ని తగ్గించుకుని, మైండ్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. లేదంటే ప్రజలు నీకు మతి తప్పిందని భావిస్తారు” అని హెచ్చరించారు. తెలంగాణ ఛాంపియన్లుగా చెప్పుకునే కల్వకుంట్ల కుటుంబం, అసెంబ్లీలో వారి అవినీతి చరిత్ర బయటపడటంతో ఆగం ఆగం అవుతున్నారని ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
LIC Jeevan Tarun Policy: LIC సూపర్ ప్లాన్ చూశారా! కేవలం రూ.150 ఆదా చేస్తే రూ.26 లక్షలు..