CP Sajjanar : సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? పోలీసులకు సమాచారమివ్వండి
- సంక్రాంతి సెలవుల్లో ఇళ్ల భద్రతపై సీపీ సూచనలు
- ఊరెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ విజ్ఞప్తి
- నగదు, బంగారం లాకర్లలోనే భద్రపరుచుకోవాలని హితవు
- చోరీల నివారణకు ఆధునిక పోలీసింగ్‌పై స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ కీలక సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లే వారు.. వెళ్లే ముందు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా నగరవాసులను అప్రమత్తం చేశారు. పండుగ వేళ చాలామంది కుటుంబ సమేతంగా ఊర్లకు వెళ్తుంటారని, ఇదే అదనుగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశముందని సీపీ పేర్కొన్నారు.
Aadi Srinivas : సీఎం రేవంత్ స్పీచ్‌కు కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతుంది ..
Also Read
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
- El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
- Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
ప్రయాణానికి ముందే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లోగానీ, బీట్ ఆఫీసర్‌కు గానీ సమాచారం ఇస్తే.. పెట్రోలింగ్‌లో భాగంగా సిబ్బంది ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతారని తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదని సీపీ సజ్జనార్ ప్రజలకు హితవు పలికారు. వాటిని బ్యాంకు లాకర్లలో లేదా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవడం ఉత్తమమని సూచించారు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా చోరీలను నివారించవచ్చని, తద్వారా పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చని పేర్కొన్నారు.
ఆధునిక పోలీసింగ్ అంటే కేవలం నేరాలు జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాదని, నేరాలను ముందుగానే నివారించడం కూడా అని ఆయన అభిప్రాయపడ్డారు. పండుగ సీజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు, మీ ఇళ్ల భద్రతకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, ఇందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. అత్యవసర సమయంలో వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని సీపీ సూచించారు.
IAS: ఐఏఎస్ కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద మృతి..
తాజావార్తలు
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
-
Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!