సైబర్ నేరగాళ్లు తమ పన్నాగాలను కొత్త పంథాలో కొనసాగిస్తున్నారు. ఈసారి వారు నేరుగా WhatsApp గ్రూపులను లక్ష్యంగా చేసుకుని జాగ్రత్తలేని వినియోగదారులను తమ బారిన పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆ మంత్రి మెరుపు తీగలా మాయమవుతాడు. పాదరసంలా జారుకుంటాడు. అవసరం వుంటేనే జిల్లాలో వాలిపోతాడు. ఇప్పుడా అవసరం ఏంటనే చర్చ…అనవసర రాద్దాంతం అవుతోంది. చివరికి మినిస్టర్‌కే తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఎంతకీ ఎవరా అమాత్యుడు? మంత్రి అనగాని సత్యప్రసాద్ చిక్కడు..దొరకడు అన్నట్టుగా తెగ ఫీలవుతున్నారు తిరుపతి జిల్లా తెలుగు తమ్ముళ్లు. ఉమ్మడి జిల్లానైనా, లేదంటే విడిగా తిరుపతి జిల్లా చూసుకున్నా మంత్రి పదవి మాత్రం స్థానిక నేతలకు దక్కలేదు. ఆ తర్వాత జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా ప్రస్తుత రెవెన్యూ […]
Shiva Jyothi : సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే యాంకర్ శివజ్యోతి ఇటీవల తిరుపతి ప్రసాదం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీకి దారితీశాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, నెగిటివ్ ట్రోలింగ్ ఎదురు కావడంతో… శివజ్యోతి ఇప్పుడు క్షమాపణలు కోరుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇటీవల తిరుపతి ప్రసాదం, స్వామి దర్శనానికి సంబంధించి ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఆమె వ్యాఖ్యలపై తీవ్రమైన […]
తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కొత్త అధ్యక్షులను ప్రకటించింది ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ. మొత్తం 36 మంది పేర్లను ఖరారు చేస్తూ 33 జిల్లాలతో పాటు కొన్ని కార్పొరేషన్లకు కూడా కొత్త బాధ్యులను నియమించింది. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఆయా డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖలీఫ్ సైదుల్లా, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దీపక్ జాన్ ను ఏఐసీసీ ప్రకటించింది. రంగారెడ్డి, సంగారెడ్డి మినహా అన్ని జిల్లాలకు డీసీసీలను ప్రకటించింది […]
Rajasaab Song Promo : డార్లింగ్ ఫ్యాన్స్‌కి, మాస్ ఆడియన్స్‌కి ఒక సూపర్ ట్రీట్ అందించేందుకు రెబల్ స్టార్ ప్రభాస్ రెడీ అయ్యారు. ఈసారి డైరెక్టర్ మారుతితో కలిసి చేస్తున్న హారర్-కామెడీ ఎంటర్టైనర్ ‘రాజాసాబ్’ సినిమాపై ఎప్పటి నుంచో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా రేంజ్‌ను, ప్రభాస్ కొత్త లుక్‌ను, క్యారెక్టరైజేషన్‌ను ఓ రేంజ్లో ఎలివేట్ చేసింది. ఆ అంచనాలను పదింతలు పెంచేలా మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ ప్రోమోను […]
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలో గల చెక్ డ్యాము ను గుర్తు తెలియని దుండగులు పేల్చివేశారు. గుంపుల మానేరు వద్ద గల చెక్ డ్యాం ను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు పేల్చివేయడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
HYDRA : హైదరాబాద్‌లోని సున్నం చెరువు పునరుద్ధరణ పనులను వేగవంతం చేస్తున్న హైడ్రా అధికారులు శనివారం స్థానికులతో కీలక సమావేశం నిర్వహించారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆంజనేయస్వామి గుడి, ముస్లింల ప్రార్థనా స్థలం ‘చిల్లా’ మార్పు గురించి ఇరుపక్షాల అభిప్రాయాలు తెలుసుకుంటూ హైడ్రా కమిషనర్ స్వయంగా నివాసితులతో మాట్లాడారు. చెరువు పునరుజ్జీవనంలో భాగంగా ఎఫ్టీఎల్లోని నిర్మాణాలను గట్టు వైపు మార్చాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించగా, రెండు వర్గాల స్థానికులూ ఈ నిర్ణయానికి అంగీకారం […]
డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ఏరియాలో నిర్వహించే రెండు రోజుల వేడుకలను రెండేండ్ల విజయోత్సవాలుగా జరపాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సీఎంవో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌తో సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు సీఎంవో […]
తెలంగాణ ప్రభుత్వ హోం శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో విస్తృత స్థాయిలో బదిలీలు చేపట్టింది. డీజీపీ ఆదేశాల మేరకు మొత్తం ఎనిమిది మంది నాన్ కేడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు.
హైదరాబాద్‌లో నకిలీ ఖాకీ వ్యవహారం వెలుగుచూసింది. జీడిమెట్ల పోలీసు పరిధిలో నకిలీ లేడీ కానిస్టేబుల్‌గా వ్యవహరించిన ఉమాభారతి అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు.