KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్‌హౌస్ వద్ద రాజకీయ సెగ రాజుకుంది. గజ్వేల్ నియోజకవర్గ ప్రతినిధిగా ఎన్నికైన కేసీఆర్, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై జిల్లా కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారు భారీ ఎత్తున తరలివచ్చి ఫామ్‌హౌస్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం, అసెంబ్లీలో ప్రజా గొంతుక వినిపించాల్సిన బాధ్యతను ఆయన విస్మరించడం సరికాదని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
Nicolas Maduro: ‘‘దమ్ముంటే నన్ను పట్టుకో..’’ అన్నంత పనిచేసిన ట్రంప్..
ఫామ్‌హౌస్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన నిరసనకారులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రజల ఓట్లతో గెలిచిన ఆయన, చట్టసభకు వెళ్లి నియోజకవర్గ అభివృద్ధి గురించి , అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. ఒకవేళ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లి తన బాధ్యతలను నిర్వర్తించడం ఇష్టం లేకపోతే, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రతినిధి సభకు రాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం ఓటర్లను అవమానించడమేనని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల నిరసనతో ఎర్రవల్లి పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
New Aviation Rules: విమానాల్లో “పవర్ బ్యాంక్స్” తీసుకెళ్తున్నారా.?, మారిన రూల్స్ తెలుసుకోండి.